Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ వచ్చాడు.. మిగిలినోళ్ళు వస్తారా?

By:  Tupaki Desk   |   13 Jun 2017 5:30 PM GMT
ఎన్టీఆర్ వచ్చాడు.. మిగిలినోళ్ళు వస్తారా?
X
ఈరోజంతా జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ మాంచి ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే 'బిగ్ బాస్' షోను తెలుగులో జూనియర్ హోస్ట్ చేస్తున్నట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి. అయితే ఈ షో తెలుగులో వస్తోంది అనగానే.. ఈ ప్రోగ్రాం గురించి తెలిసినోళ్ళు మాత్రం తెలుగు టివిల్లో ఇక రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో అని ఆత్రంగా చూస్తున్నారు. ఆల్రెడీ మన టివి షోల్లో బూతు కంటెంట్ బాగానే కుమ్మేస్తున్న ఈ రోజుల్లో.. ఇక బిగ్ బాస్ అంటే లైవ్ లో ఒరిజినల్ రొమాన్స్ చూపించినట్లే.

ఒక పద్నాలుగు మందిని ఒకే ఇంట్లో పెట్టేసి.. వారికి కొన్ని రోజులకు సరిపోయేలా ఆహారం వగైరా ఏర్పాట్లు చేసి.. ఆ హౌస్ లో రకరకాల టార్గెట్లు ఇస్తారు. అందులో అబ్బాయిలూ అమ్మాయిలూ కూడా ఉంటారు. ఈ హౌస్ లో వారిని ప్రేమలో పడేయమని చెప్పొచ్చు.. గొడవలు పడమని చెప్పొచ్చు.. ఇంకేదైనా చెప్పొచ్చు. ఒక్కొక్కిరినీ ఎలిమినేట్ చేస్తూ విన్నర్ కు కోట్లలో ప్రైజ్ మనీ ఇస్తారు. ఇక ప్రేమలో పడమంటే.. నిజంగానే ముద్దులూ హద్దులు దాటి శృంగారం కూడా జరిపిన నిష్ణాతులు ఇండియన్ బిగ్ బాస్ లో కూడా ఉన్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పార్టిసిపెంట్ గా వచ్చిన సన్నీ లియోన్ ఇక్కడ బాలీవుడ్లోకి ఎంటరైంది. అసలు 2006లో వచ్చిన తొలి సీజన్ బిగ్ బాస్ లో రాఖీ సావంత్.. కాశ్మీరా షా దారుణంగా కొట్టుకున్నారు. వాటిని ఎవ్వరూ మర్చిపోలేం. మరో కంటెస్టెంట్ పూజా మిశ్రా అయితే నన్ను లైంగింకంగా ఆ హౌస్ లో వేధించారు అని చెప్పింది. దివంగత పొలిటిషీయన్ ప్రమోద్ మహాజన్ కొడుకు రాహుల్ మహాజన్.. బిగ్ బాస్ స్విమ్మింగ్ పూల్ లో నటి పాయల్ రోహత్గితో రొమాన్సే జరిపాడు. ఆ తరువాత అతని ఫ్యామిలీ లైఫ్‌ చాలా డిస్ర్టబ్ అయ్యింది. సప్నా భవనాని అనే హెయిర్ స్టయిలిస్ట్ ఈ షోలోకి వచ్చాక.. సల్మాన్ ఖాన్ ను ఓపెన్ గా బూతులు తిట్టింది. వల్గర్ ఎక్స్ పోజింగ్ కు మారుపేరైన సోఫియా హాయత్ ను ఈ షోలో అర్మాన్ కొహ్లీ అనే పార్టిసిపెంట్ చాచి కొట్టాడు. ఇక అతగాడితో కాజోల్ చెల్లి తనీషా (కంత్రీ మూవీ హీరోయిన్) ఏకంగా పీకల్లోతు ప్రేమలో పడిపోయింది.

ఇన్నేసి చిందులను బాలీవుడ్ బిగ్ బాస్ లో వేయించాక ఇప్పుడు తెలుగులో ఏం చేయబోతున్నారు? గతంలో ఓంకార్ షోస్ కొన్నింటిలో మన తెలుగు సెలబ్రిటీలు ఎలా కొట్టుకున్నారో చూశాం. అక్కడ కేవలం డ్యాన్సులు మరియు ఇతర అడ్వంచర్ ప్రోగ్రాములకే ఇలా కొట్టుకుంటే.. ఇక బిగ్ బాసులో మన సెలబ్రిటీలు ఎన్నేసి ఫీట్లు చేస్తారో ఏంటో. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి.. ఎన్టీఆర్ ఈ ప్రోగ్రామును హోస్ట్ చేయడానికి వచ్చినంత ఈజీగా.. మరి ఇతర తెలుగు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తారా అనేదే అసలు ప్రశ్న!! గాట్ ఇట్?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/