Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ కోసం సూటేసిన ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   13 Jun 2017 8:29 AM GMT
బిగ్ బాస్ కోసం సూటేసిన ఎన్టీఆర్
X
ఇప్పుడు ఇండియా అంతా పాపులర్ షో అని చెప్పలేం కాని.. సెలబ్రిటీల కొత్తరకం స్కాండల్స్.. గొడవలు.. ముద్దులు.. యుద్దాలతో ''బిగ్ బాస్'' అనే షో బాగా పాపులరైంది. ఈ షో హోస్టు కంటే కూడా లోపల బిగ్ బాస్ హౌసులో ఓవర్ యాక్షన్ చేసే కంటెస్టెంటుల కారణంగా విపరీతమైన పబ్లిసిటీ సంపాదించింది. అయినా కూడా సల్మాన్ ఖాన్ ఈ షో ను తనదైన శైలిలో హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు తెలుగులో ఈ బాధ్యత ఎన్టీఆర్ తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆల్రెడీ ఎన్టీఆర్ ఎంట్రీ కన్ఫామ్ అవ్వగా.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ బయటకొచ్చింది. యథావిథిగా తన లవకుశ సినిమాలోని గెడ్డం మీసం లుక్ ను అలాగే మెయిన్టయిన్ చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఈ షో కోసం సూటేశాడు. స్టయిలుగా ఆ కుర్చీలో కూర్చొని.. ఒక కంటిని మూసేసి నాటీగా ఫోజిచ్చాడు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ టీజర్లను మెగాస్టార్ చిరంజీవితో చాలా క్రియేటివ్ గా రూపొందించిన స్టార్ మా టీమ్.. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం బిగ్ బాస్ ప్రోమోలను కూడా అదే విధంగా రెడీ చేస్తున్నారట.

కాకపోతే ఇప్పుడు తన కెరియర్ చాలా అద్భుతంగా వరుస హిట్లతో.. అది కూడాను మాంచి కంటెంట్ ఉన్న కథలతో సినిమాలు చేస్తున్న వేళ.. ఇప్పుడు టివి వైపు వెళితే ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనేది తెలియాల్సిన అంశం. వెయిట్ అండ్ సి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/