Begin typing your search above and press return to search.

తార‌క్ టీవీ షో షూటింగ్ అక్క‌డ‌ట‌

By:  Tupaki Desk   |   15 Jun 2017 6:17 AM GMT
తార‌క్ టీవీ షో షూటింగ్ అక్క‌డ‌ట‌
X
టాలీవుడ్ అగ్ర‌హీరోల్లో ఒక‌రిగా.. వ‌రుస విజ‌యాల‌తో మాంచి ఊపు మీదున్న తార‌క్‌.. తాజాగా ఒక టీవీ షో చేయ‌నున్న‌ట్లు చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న బిగ్ బాస్ షోను తెలుగు వెర్ష‌న్ చేయ‌టానికి స్టార్ ప్లాన్ చేయ‌టం.. అందులో ప్ర‌యోక్త‌గా తార‌క్‌ ను ఫైన‌ల్ చేయ‌టం తెలిసిందే.

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న ఒక అగ్ర‌హీరో ఒక టీవీ షోకు ఒప్పుకోవ‌టంపై ఇప్పుడు హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. అయితే.. షో కోసం తార‌క్ ఓకే అన‌టం వెనుక చాలానే లెక్క‌లు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ షోలో తార‌క్ షూట్‌ ను హైద‌రాబాద్ లో చేయ‌టం లేద‌న్న‌ది తాజా క‌బ‌ర్‌. త‌న మీద షూట్ చేయాల్సిన పోర్ష‌న్‌ ను ముంబ‌యిలో చేయాల‌ని తార‌క్ కండీష‌న్ పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇందుకోసం హైఎండ్ టెక్నిషియ‌న్స్‌ను వాడాల‌ని తార‌క్ కండీష‌న్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కూ అగ్ర‌హీరోలు చేసిన షోల‌న్నీ హైద‌రాబాద్‌ లోనే షూట్ చేసుకోగా.. తార‌క్ మాత్రం ముంబ‌యిని ఎంచుకోవ‌టం గ‌మ‌నార్హం. షో రిచ్ గా ఉండటంతో పాటు.. ఓ రేంజ్లో ఉండాల‌న్న ఉద్దేశంతోనే ముంబ‌యిని ఎంపిక చేసుకున్న‌ట్లు చెబుతున్నారు.

ఈ షో కోసం స్టార్ మాకు తార‌క్ కండీష‌న్ల లిస్ట్ పెద్ద‌దేన‌ని చెబుతున్నారు. భారీ పారితోషికంతో పాటు.. షూటింగ్‌ కు టాప్ టెక్నిషియ‌న్స్ ను ఉప‌యోగించ‌టం.. ముంబ‌యిలో షూట్ చేయ‌టం.. లాంటి వాటితో షో బ‌డ్జెట్ భారీగా మారింద‌ని చెబుతున్నారు. అయితే.. ఇంత ఖ‌ర్చు చేసినా.. బిగ్ బాస్ తెలుగు షోతో ఛాన‌ల్ సుడి మొత్తంగా తిరిగిపోతుంద‌న్న ఆశ‌లో స్టార్ మా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/