Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బిగ్ బాస్ ప్రోమో అదిరింది

By:  Tupaki Desk   |   27 Jun 2017 4:07 AM GMT
ఎన్టీఆర్ బిగ్ బాస్ ప్రోమో అదిరింది
X
తెలుగు హీరోలు సినిమాల్లోనే కాదు బుల్లి తెరపై కూడా దుమ్ము రేపుతున్నారు. తెలుగులో టాక్ షో లు ఉన్నవి తక్కువే ఈ కొన్ని కూడా యాంకర్లు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రియాలిటీ షో జమానా కాబట్టి పెద్ద పెద్ద ప్రొడక్షన్లు స్టార్స్ నీ హోస్ట్ గా తీసుకుంటున్నారు. సీనియర్ నటులు నాగార్జున - చిరంజీవి తరవాత ఇప్పుడు రానా - ఎన్టీఆర్ వంతు వచ్చింది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ షో తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి సంబంధించి గతంలో టీజర్ రాగా.. ఇప్పుడు ఒక ప్రోమో ను కూడా విడుదల చేశారు. ఒక్క ప్రోమోతో బిగ్ బాస్ ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందో చెప్పారులే.

రూమ్ లో ఉన్న బెడ్ పై కెమెరా నెమ్మదిగా దగ్గరకు వెళ్ళుతుంది అప్పుడే అలారం చప్పుడు విని దుప్పటిలో ముసుగుతన్ని పడుకున్న ఎన్టీఆర్ టక్కున లేచి ఆనయిన అలారం అపి పక్కనే ఉన్న కాఫి తాగుతుంటే తననే చూస్తున్న కెమెరాలను చూసి ఉలిక్కి పడి “ఓరి నాయనో కెమెరాలు ఇక్కడ ఎవడు రా పెట్టమన్నది నేను చెప్పింది బిగ్ బాస్ హౌస్ లో పెట్టమన్నాను నా ఇంటిలో కాదు తొందరగా మార్చండి'' అని చెప్పి అలుపును ఆపుకుంటూ ఉంటే ప్రోమో అయిపోతుంది.” చుట్టూ కెమెరాలు ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి బిగ్ బాస్ ఇంటిలో ఉండాలంటే ఎంత అప్రమత్తంగా ఉండాలో చూపించారు.

అంటే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఏమి చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అనేది ప్రతి నిమిషం రికార్డు అవుతుంది అన్నమాట. బిగ్ బాస్ అనే ఒక హౌస్ లో గేమ్ లో పాల్గొనే వారంతా ఒక్క దగ్గరే కొన్ని నెలలు పాటు ఉండవలిసి ఉంటుంది. బిగ్ బాస్ లో పాల్గొనే పోటీదారులు ఇంకా ఎవరు అనేది తెలియవలిసి ఉంది. పోసాని కృష్ణ మురళి బిగి పాల్గొనే ఛాన్సుందని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/