Begin typing your search above and press return to search.

పవన్ వల్ల ఎన్టీఆర్ ఖాళీయేనా?

By:  Tupaki Desk   |   9 Sept 2017 9:53 PM IST
పవన్ వల్ల ఎన్టీఆర్ ఖాళీయేనా?
X
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తనకంటూ ఓ పెద్ద మార్కెట్ ని సెట్ చేసుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. ఎలాంటి సినిమాలో అయినా తన నటనతో 100% పాత్రకు న్యాయం చేస్తాడని మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా టాలీవుడ్ లో 100 కోట్ల మార్కెట్ ను కూడా అందుకొని భారీ చిత్రాలను తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపోతే తారక్ సినిమా షూటింగ్స్ కూడా ఎక్కువ లెట్ చెయ్యడు. త్వర త్వరగా పూర్తి చేసి అనుకున్న టైమ్ కి సినిమా రిలీజ్ చెయ్యాలని పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు.

ఇప్పటికే కళ్యాణ్‌ రామ్ నిర్మాణంలో బాబీ తెరకెక్కించిన 'జై లవకుశ' సినిమాను పూర్తి చేసి సెప్టెంబర్ 21 రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఎన్టీఆర్ బిజీగానే ఉంటాడు. కానీ ఆ తర్వాత ఏ సినిమాను చేస్తాడన్నది ఇంకా తారక్ డిసైడ్ చేసుకోలేదట. అసలైతే జై లవకుశ తరువాత ఎన్టీఆర్- త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 25వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తవ్వడానికి ఇంకా కనీసం 3 నెలల సమయం పడుతుంది. ఇక ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దీంతో ఎన్టీఆర్ అప్పటివరకు ఖాళీగా ఉండాల్సిందేనని తెలుస్తోంది. బిగ్ బాస్ కూడా మరో 10 రోజుల్లో అయిపోతోంది కాబట్టి.. ఇంకా వేరే వర్క్ ఏమీ లేదు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం అనే కథకు కూడా ఎన్టీఆర్ ఒకే చెప్పాడు ఒకవేళ చెయ్యాలనిపిస్తే ఆ సినిమా చేస్తాడా లేక వెయిట్ చేసి త్రివిక్రమ్ తో చేస్తాడా అనేది తెలియాలంటే పూర్తి వివరాలు తెలిసేంత వరకు వెయిట్ చేయాల్సిందే.