Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బాహుబ‌లి క‌త్తి ప‌ట్టి..

By:  Tupaki Desk   |   30 March 2017 4:33 AM GMT
ఎన్టీఆర్ బాహుబ‌లి క‌త్తి ప‌ట్టి..
X
ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుత తెలుగు క‌థానాయ‌కుల్లో అత్యంత ఇష్ట‌ప‌డేది జూనియ‌ర్ ఎన్టీఆర్ నే అని కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. రాజ‌మౌళి అంటే ఎన్టీఆర్ కూ అంతే అభిమానం. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్లో మూడు సినిమాలొచ్చాయి. వాటిలో ఒక‌టి ఇండ‌స్ట్రీ హిట్ (సింహాద్రి). ఒక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ (య‌మ‌దొంగ‌). ఇంకోటి సూప‌ర్ హిట్ (స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్‌). ఐతే ఈ ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేసి ద‌శాబ్దం అయిపోయింది. జ‌క్క‌న్న‌తో మ‌ళ్లీ ఓ సినిమా చేయాల‌న్న త‌న కోరిక‌ను ఎన్టీఆర్ మ‌ళ్లీ మ‌ళ్లీ బ‌య‌ట‌పెట్టినా.. జ‌క్క‌న్న‌కే వీలు చిక్క‌డం లేదు. ‘బాహుబ‌లి’ కోసం ఐదేళ్లుగా అంకిత‌మైపోయి ఉన్నాడు రాజ‌మౌళి.

మ‌ళ్లీ వీళ్లిద్ద‌రి కాంబో ఎప్పుడు తెర‌మీదికి వ‌స్తుందో కానీ.. ఐఫా అవార్డుల వేడుక సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బాహుబ‌లి వీఆర్ స్టాల్ ద‌గ్గ‌రికి వ‌చ్చిన తార‌క్.. బాహుబ‌లి క‌త్తి.. డాలు ప‌ట్టి పోజు ఇవ్వ‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఈ వేడుక‌కు సూటేసుకుని చాలా స్టైలుగా.. స‌రికొత్త‌గా త‌యారై వ‌చ్చిన ఎన్టీఆర్.. బాహులి ప్ర‌భాస్ సినిమా క‌దా అన్న బేష‌జాలేమీ పెట్టుకోకుండా క‌త్తి.. డాలు ప‌ట్టి ఫొటోల‌కు పోజిచ్చాడు. త‌న కొత్త సినిమా ‘జై ల‌వ‌కుశ’ కోసం బరువు త‌గ్గి లుక్ మార్చుకున్న తార‌క్.. ఆ తర్వాత పాల్గొన్న ప‌బ్లిక్ ఈవెంట్ ఇదే. ఊరికే చెప్ప‌డం కాదు కానీ.. సూట్లో ఎన్టీఆర్ అద‌ర‌గొట్టేశాడు. అత‌డి లుక్ కూడా ఆక‌ట్టుకుంది. మ‌రి అత‌ను సినిమాలో ఎలా క‌నిపిస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/