Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కి సారీ చెప్పిన ఎన్టీఆర్!

By:  Tupaki Desk   |   3 Sep 2022 3:43 AM GMT
ఫ్యాన్స్ కి సారీ చెప్పిన ఎన్టీఆర్!
X
రణ్ బీర్ కపూర్ .. అలియా .. అమితాబ్ .. నాగార్జున ప్రధానమైన పాత్రలను పోషించిన 'బ్రహ్మాస్త్ర' తెలుగు ప్రేక్షకుల ముందుకు 'బ్రహ్మాస్త్రం' పేరుతో రానుంది. కరణ్ జొహార్ నిర్మించిన ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు . ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ స్టేజ్ పై ఎన్టీఆర్ మాట్లాడుతూ .. "ముందుగా అభిమానులందరికీ సారీ చెబుతున్నాను". ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా చేయాలని అనుకున్నారు. కానీ 'వినాయకచవితి' కారణంగా తగినంత పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేమని పోలీస్ వారు చెప్పారు. వాళ్లు చెప్పేది కూడా మన రక్షణ కోసమే కనుక ఈ వేడుకను సింపుల్ గా ప్లాన్ చేయడం జరిగింది. మీరు ఈ ఈవెంట్ కి రాకపోయినా మంచి చిత్రాన్ని ఆశీర్వదిస్తారని నాకు తెలుసు. ఈవెంట్ ప్లేస్ ను మార్చి చిన్నపాటి అసౌకర్యాన్ని కలిగించినందుకు గాను మీడియాకి కూడా సారీ చెబుతున్నాను.

నాకు అమితాబ్ గారంటే చాలా ఇష్టం. ఆయన కళ్లు ... ఆయన వాయిస్ .. లెఫ్ట్ హ్యాండ్ తో కూడిన బాడీ లాంగ్వేజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తరువాత నేను ఎక్కువగా అభిమానించేది రణ్ బీర్ కపూర్ గారినే. ఆయన చేసిన సినిమాలలో నాకు 'రాక్ స్టార్' ఎక్కువ నచ్చుతుంది. ఆ సినిమాలోని పాటలను నేను ఎక్కువగా వింటూ ఉంటాను. అలాంటి ఆయన ఈవెంట్ నా హోమ్ టౌన్ హైదరాబాద్ లో జరగడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది.

ఇప్పుడున్న ఈ జనరేషన్ లో అలియా మంచి ఆర్టిస్ట్. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో తను నాకు ఫ్రెండ్ అయింది. ఈ స్టేజ్ ఫై ఉన్నవారిలో రాజమౌళి గారు .. నాగార్జున బాబాయ్ తరువాత అంతటి చనువు నాకు అలియా తో ఉంది. కరణ్ జొహార్ గొప్ప నిర్మాత .. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఆయనికి ఎంతో గౌరవం. ఇలాంటి సినిమాలు మరెన్నో ఆయన నిర్మించాలని నేను కోరుకుంటున్నాను. అయాన్ ముఖర్జీ ఈ ఫంక్షన్ కి రాలేకపోయారు. ఈ సినిమా రిలీజ్ పనుల్లోనే ఆయన బిజీగా ఉన్నారు.

హిందీలో నేను ఫస్టు చూసిన సినిమా నాగార్జున బాబాయ్ చేసిన 'ఖుదాగావా'. ఒక హిందీ సినిమా చేసి .. హిందీలో మాట్లాడితే ఎలా ఉంటుందా అని చూసిన సినిమా అది. ఆ సినిమాతో ఆయన నాకు అలా గుర్తుండిపోయారు. ఆయన గురించి మాట్లాడటానికి నా వయసు సరిపోదు. ప్రేక్షకులు ఆశిస్తున్న కొత్తదనాన్ని ఈ సినిమా అందిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.