Begin typing your search above and press return to search.

బాబాయ్ తరువాత అబ్బాయ్ తోనే అనిల్ రావిపూడి!

By:  Tupaki Desk   |   2 April 2022 10:33 AM GMT
బాబాయ్ తరువాత అబ్బాయ్ తోనే అనిల్ రావిపూడి!
X
టాలీవుడ్లో తమ కెరియర్ ను మొదలుపెట్టిన తరువాత ఇంతవరకూ అపజయం ఎరుగని దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. సినిమాకి .. సినిమాకి అనిల్ రావిపూడి తన సక్సెస్ గ్రాఫ్ ను పెంచుతూ వెళుతున్నాడు. అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అదే సమయంలో లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కూడా ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అందువలన ఆయనతో సినిమాలు చేయడానికి యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు సైతం ఆసక్తిని చూపుతుంటారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి .. 'ఎఫ్ 3' సినిమా చేస్తున్నాడు. వెంకటేశ్ - వరుణ్ తేజ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను బాలకృష్ణతో చేయడానికి అనిల్ రావిపూడి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని బాలకృష్ణ కూడా ధృవీకరించారు. ప్రస్తుతం బాలకృష్ణ .. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడి తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఇక అనిల్ రావిపూడి ఈ సినిమా తరువాత ప్రాజెక్టును ఎన్టీఆర్ తో చేయనున్నాడని అంటున్నారు.

ఎన్టీఆర్ తాజా చిత్రంగా థియేటర్లకు వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత సినిమాను ఆయన కొరటాల దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుందని అంటున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. అవినీతి రాజకీయాల నేపథ్యలోనే ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా తరువాత 'ఉప్పెన' బుచ్చిబాబుతో గానీ .. ప్రశాంత్ నీల్ తో గాని ఎన్టీఆర్ ప్రాజెక్టు ఉండొచ్చునని అనుకున్నారు.

కానీ తాజాగా అనిల్ రావిపూడి పేరు వినిపిస్తోంది. బుచ్చిబాబు చెప్పిన కథ కంటే .. ప్రశాంత్ నీల్ చెప్పిన కథ కంటే ముందుగా అనిల్ రావిపూడితో చేయడమే బెటర్ అనే నిర్ణయానికి ఎన్టీఆర్ వచ్చాడని అంటున్నారు. అందుకు కారణం అనిల్ రావిపూడి కథలోని కొత్తదనం .. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకి భిన్నంగా ఉండటం .. చాలా కాలం తరువాత తన వైపు నుంచి కామెడీ ఎక్కువగా ఉన్న కథ కావడం వలన అనిల్ రావిపూడితో ముందుగా చేసేయాలనే నిర్ణయానికి ఎన్టీఆర్ వచ్చాడని అంటున్నారు. అంటే బాబాయ్ తరువాత .. అబ్బాయ్ తోనే అనిల్ రావిపూడి సినిమా చేయనున్నాడన్న మాట.