Begin typing your search above and press return to search.

ఢిల్లీ రాజకీయాలను షేక్ చేయబోతున్న తారక్

By:  Tupaki Desk   |   29 Jan 2020 10:14 AM IST
ఢిల్లీ రాజకీయాలను షేక్ చేయబోతున్న తారక్
X
‘అయిననూ పోయి రావలె హస్తినకు’ ఇప్పుడీ సినిమా టైటిల్ టాలీవుడ్ లోనే కాదు.. రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్టర్ అవుతోంది. అసలు ఏముంది ఈ టైటిల్ లో అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. యంగ్ టైగర్ , రాజకీయాలను శాసించిన తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ మనవడిని ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో చూపించబోతున్నారట.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని తీయబోతున్నాడన్న ప్రచారం టాలీవుడ్ ను ఊపేస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వం లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ మేలో పూర్తికాగానే త్రివిక్రమ్ తో కలిసి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే సినిమాలో నటించబోతున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో నటించబోతున్నాడట.. ఢిల్లీ రాజకీయాలను షేక్ చేసే కథ రాసుకున్నాడట త్రివిక్రమ్. తనకు కలిసి వచ్చిన ‘అ’ అక్షరంతో సినిమా టైటిల్ ను పెట్టాడట..

తన తాత ఎన్టీఆర్ పోలికలతో ఉన్న జూనియర్ ను.. 80వ దశకంలో ఢిల్లీ రాజకీయాలను శాసించిన ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకునే త్రివిక్రమ్ ఈ పాత్ర డిజైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ నుంచి పోలికలతో పాటు వాగ్దాటిని , ప్రతిభను పుణికిపుచ్చుకున్న తారక్ ఇటువంటి పాత్ర వస్తే ఊరుకుంటాడా? ఇరగదీస్తాడు. అందుకే ఫస్ట్ టైం పొలిటిషియన్ పాత్రలో ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడన్నది ఆసక్తిగా మారింది.. అయితే తారక్-త్రివిక్రమ్ తీయబోయే ‘అయిననూ పోయి రావలె హస్తినకు’పై ఇంత వరకూ అటు ఎన్టీఆర్ కానీ, త్రివిక్రమ్ కానీ అధికారికం గా ఇప్పటి వరకూ స్పందించలేదు.