Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కూడా లండన్‌కే..!
By: Tupaki Desk | 19 March 2015 11:00 AM ISTదర్శకుడు సుకుమార్‌కి లండన్ పిచ్చపిచ్చగా నచ్చేసినట్టుంది. ఇదివరకు '1' (నేనొక్కడినే) కోసం మహేష్‌ని కూడా అక్కడికే తీసుకెళ్లి మేజర్ పార్ట్ షూట్ చేసుకొచ్చాడు. లండన్ బాబూ... లండన్ బాబూ... అంటూ అందులో ఓ ఐటెమ్ పాట కూడా పెట్టించేశాడు. అన్నట్టు ఇప్పుడు ఎన్టీఆర్‌ని కూడా లండన్‌బాబుగానే మార్చేస్తున్నాడు సుక్కు. కథేంటో తెలియదు కానీ... సుక్కు, ఎన్టీఆర్‌ల సినిమా చిత్రీకరణ లండన్‌లోనే మొదలవుతుందట. అందుకు ఏప్రిల్ 17ని ముహూర్తంగా నిర్ణయించారు. ఇప్పటికే కథ, కథనాలకు తుదిమెరుగులు దిద్దేశాడు సుకుమార్. కథానాయికగా రకుల్‌ని ఎంపిక చేసేశారు. ఏప్రిల్ 17 నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతారు. సినిమాలో ఎన్టీఆర్ యంగ్‌లీడర్‌గా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. 'టెంపర్'తో విజయాన్ని సొంతం చేసుకొన్న ఎన్టీఆర్... ఆ ఉత్సాహంతో కొత్త సినిమా కోసం రంగంలోకి దిగుతున్నారు. 'టెంపర్' తరహాలోనే ఇందులో కూడా ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌తో కనిపిస్తారని తెలుస్తోంది.
