Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌-సుక్కు.. కొబ్బరికాయ కన్‌ఫామ్‌

By:  Tupaki Desk   |   8 April 2015 7:05 PM IST
ఎన్టీఆర్‌-సుక్కు.. కొబ్బరికాయ కన్‌ఫామ్‌
X
ఇకపోతే బడ్జెట్‌ సెట్టవ్వకపోవడం వలన సినిమా లేటవుతోంది.. కాకరకాయ.. కొత్తిమీరకట్ట.. వంటి రూమర్లు ఇక నమ్మక్కర్లేదు. ఎందుకంటే, ఇప్పుడు స్వయంగా నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ లైన్‌లోకి వచ్చేశారు. అసలు ఈ సినిమాతో ఏం జరగుతుందో చెప్పేశారు.

''నాన్నకు ప్రేమతో'' లేకపోతే ''దండయాత్ర'' అనే టైటిల్స్‌పై ఎటువంటి క్లారిటీ రాలేదు కాని, ఎన్టీఆర్‌ తదుపరి ప్రాజెక్టు ఎప్పుడు బిగిన్‌ అవుతుందో తెలిసిపోయింది. మనోళ్ళు ఈ సినిమాను మే 1న లండన్‌లో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌, సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌ స్పెయిన్‌ దేశంలోని బార్సిలోనా నగరంలో కూర్చొని మ్యూజిక్‌ కంపోజ్‌ చేయడంలో నిమగ్నమయ్యారట. ఈ పనులు రేపటితో ముగుస్తున్నాయి. ఇక గ్యాంగంతా లండన్‌ చేరుకొని, మే 1 నుండి అక్కడ షూటింగ్‌ కూడా స్టార్ట్‌ చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో తొలిసారిగా సుకుమార్‌తో ఎన్టీఆర్‌ వర్క్‌ చేస్తుంటే, ఇక ఎన్టీఆర్‌ వంటి పెద్ద స్టార్‌తో సెక్సీ బ్యూటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జతకడుతోంది. ఈమె కూడా ఈ ప్రాజెక్టు గురించి ఫుల్‌గా ఎక్సయిట్‌మెంట్‌తో ఉంది.