Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్: బ్యాక్ టు వర్క్ రేపే

By:  Tupaki Desk   |   31 Aug 2018 6:17 PM IST
ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్: బ్యాక్ టు వర్క్ రేపే
X
నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం ఆయన తనయులైన కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ లకు ఎవరూ కూడా పూడ్చలేని లోటు. ఈ నిన్ననే తమ తండ్రి అంత్యక్రియలలో పాల్గొన్న ఇద్దరూ నందమూరి సోదరులు రేపటి నుండే తమ సినిమాల షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారట. తమ పర్సనల్ లాస్ కారణంగా సినిమా ప్రొడ్యూసర్లకు ఇబ్బంది కలగకూడదని షెడ్యూల్ ప్రకారం ఆ సినిమాలు రిలీజ్ కావడానికి తమ బాధను పక్కన బెట్టి షూటింగ్ లో పాల్గొనాలనే నిర్ణయం తీసుకున్నారట. సన్నిహితులు కూడా ఇంట్లో ఉంటే నాన్న జ్ఞాపకాలు పదే పదే గుర్తొస్తాయని అదే వర్క్ లో పడితే కాస్తయినా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుందని చెప్పారట. తండ్రి లోకాన్ని విడిచి వెళ్ళారనే బాధను ఎలాగూ మనసునుండి చేరిపేయలేము కాబట్టి షూటింగ్ - రెగ్యులర్ లైఫ్ లో పడితే డైవర్షన్ ఉంటుందని వాళ్ళు సూచన ఇచ్చారట.

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' లో నటిస్తున్నాడు. ఈ సినిమా దసరా సీజన్లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు కళ్యాణ్ రామ్ సినిమాటోగ్రాఫర్ కెవీ గుహన్ దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లు ఇద్దరూ రేపటి నుండి షూటింగ్ లో పాల్గొంటామని ఇప్పటికే ఫిలిం యూనిట్ సభ్యులకు సమాచారం అందించారట. ఇలా చేయడానికి మరో కారణం కూడా ఉందట. సీనియర్ ఎన్టీఆర్ - నందమూరి హరి కృష్ణ ఇద్దరూ కూడా పుట్టిన రోజైనా.. మరో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా షూటింగ్ లు క్యాన్సిల్ చేసేందుకు ఒప్పుకునేవారు కాదట. తాత గారి -తండ్రి గారి సెంటిమెంట్ ను ఇప్పుడు ఇద్దరు నందమూరి సోదరులు పాటిస్తున్నారు.

కారణాలు ఏవైనా రేపటి నుంచే షూటింగ్ లో పాల్గోనాలనే నిర్ణయం ఆ ఫిలిం యూనిట్ సభ్యుల -అభిమానుల హృదాయాలను టచ్ చేస్తోంది. తమవల్ల సినిమా రిలీజ్ డెడ్ లైన్ మిస్ కాకుడదనే ఆలోచనను అందరూ ప్రశంసిస్తున్నారు.