Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్, బాలయ్య మాట్లాడుకున్నారా అసలు?

By:  Tupaki Desk   |   11 Dec 2015 4:00 AM IST
ఎన్టీఆర్, బాలయ్య మాట్లాడుకున్నారా అసలు?
X
‘యమదొంగ’ సినిమాలో యమ సభలో భారీ డైలాగ్ చెప్పి చివర్లో ఎనీ డౌట్స్ అంటాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నిన్న సాయంత్రం ‘నాన్నకు ప్రేమతో’ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసి సంక్రాంతికే వచ్చేస్తున్నా.. ఎనీ డౌట్స్ అని చెప్పకనే డైలాగ్ చెప్పేశాడు ఎన్టీఆర్. దీంతో సంక్రాంతికి నందమూరి హీరోల వార్ ఖాయమని తేలిపోయింది. సంక్రాంతికి అటు ఇటుగా నెల రోజులే సమయం ఉంది ఇంత కాన్ఫిడెంట్‌ గా రిలీజ్ పోస్టర్ రిలీజ్ చేశారంటే ఇక బాబాయి-అబ్బాయి పోరు విషయంలో సందేహాలేమీ పెట్టుకోనక్కర్లేదు.

ఐతే ఈ పోరు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ప్రశ్న. అసలే బాబాయి - అబ్బాయి మధ్య కొన్నేళ్లుగా కమ్యూనికేషన్ లేదు. రిలేషన్ అంతకంతకూ వీక్ అయిపోతున్నట్లుంది. నందమూరి అభిమానుల్లోనూ వర్గాలు వచ్చేశాయి. బాబాయి - అబ్బాయి సినిమాలు వచ్చినపుడు ఈ వర్గాలు పరస్పరం ఆపోజిట్ గా పని చేయడం కూడా చూస్తున్నాం. ఇక ఇద్దరూ ఒకేసారి బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు.

అభిమానులు గొడవలు పడకుండా ఏకతాటిపై నడిస్తే ఒకేసారి పోటీ పడ్డా సమస్య ఉండదు. ఈ విషయంలో బాబాయి, అబ్బాయి మాట్లాడుకుని.. అభిమానులతో కూడా డిస్కషన్లు పెడితే సమస్యేమీ ఉండదు. అలా కాకుండా ఎవరి దారిలో వాళ్లు నడుస్తూ.. అభిమానులకు దిశానిర్దేశం చేయకుంటే మాత్రం ప్రతికూల ఫలితాలు రావచ్చు. సినిమాల విడుదల సందర్భంగా గొడవలు కూడా చెలరేగొచ్చు. కాబట్టి పోటీకి దిగితే దిగారు కానీ.. కొంచెం కమ్యూనికేట్ చేసుకుని, అభిమానులకూ ఓ మెసేజ్ అందేలా చూస్తే బెటర్.