Begin typing your search above and press return to search.

బన్నీ.. ఎన్టీఆర్‌.. కేకలు పెట్టిస్తున్నారు

By:  Tupaki Desk   |   7 July 2015 12:47 PM IST
బన్నీ.. ఎన్టీఆర్‌.. కేకలు పెట్టిస్తున్నారు
X
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌.. ఓడిపోలేదోయ్‌!! అంటూ అప్పట్లో ఓ కవి అద్భుతమైన వాక్యం రాశాడు. దాన్ని మన సినిమావాళ్లు చాలాసార్లు రిపీట్‌గా వాడేశారు. అయితే ఇప్పుడు అలాంటి ఫీట్‌నే రిపీట్‌ చేస్తున్నారు బన్ని, తారక్‌.

ఈ ఇద్దరూ ఇటీవలి కాలంలో జనాలకు తెగ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. కథల ఎంపికల నుంచి క్యారెక్టర్లలో ఛేంజ్‌, బాడీ లాంగ్వేజ్‌, లుక్‌ డిజైన్‌, కాస్ట్యూమ్స్‌ వరకూ ప్రతి విషయంలో కొత్త కొత్త మార్పులు తెచ్చేశారు. అంతేనా దర్శకుల ఎంపికలోనూ అంతే విలక్షణంగా ఆలోచిస్తున్నారిద్దరూ. ఒకసారి క్లాస్‌ డైరెక్టర్‌, క్లాస్‌ స్టోరీతో పనిచేస్తే, మరొకసారి మాస్‌ డైరెక్టర్‌ని మాస్‌ కథని ఎంచుకుంటున్నారు.

ఇప్పటికిప్పుడు సుకుమార్‌ లాంటి క్లాస్‌ డైరెక్టర్‌ని ఎంచుకుని ఎన్టీఆర్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు. మాస్‌ హీరో-క్లాస్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌ అంటే జనాలకు నిజంగానే ఆశ్చర్యం కలిగించే కలయిక కిందే లెక్క. అయితే సేమ్‌ టైమ్‌ బన్ని కూడా అంతే విలక్షణతను చూపిస్తున్నాడు. సుకుమార్‌ లాంటి క్లాస్‌ డైరెక్టర్‌తో పనిచేసిన బన్నీ ప్రస్తుతం బోయపాటి లాంటి మాస్‌ డైరెక్టర్‌ని రంగంలోకి దించాడు. కుడి ఎడమైతేనే బాక్సాఫీస్‌ కళకళలాడుతుందన్న నమ్మకంతోనే ఇలా చేస్తున్నారు.

అంతేనా లుక్‌ విషయంలోనూ అంతే మార్పు చేర్పులు చూపిస్తున్నారిద్దరూ. ఎన్టీఆర్‌ టెంపర్‌లో 6ప్యాక్‌లో చొక్కా లేకుండా కనిపించి షాకిచ్చాడు. అదే టైమ్‌లో బన్ని సన్నాఫ్‌ సత్యమూర్తిలో హనీసింగ్‌ లుక్‌లో కనిపించి షాకిచ్చాడు. ఇప్పుడు హనీసింగ్‌కే బాస్‌లా కనిపించే లుక్‌తో జనాల ముందుకు వస్తున్నాడు ఎన్టీఆర్‌. ఇలా బన్ని, ఎన్టీఆర్‌ వైవిధ్యంలో పోటీపడుతున్నారు.