Begin typing your search above and press return to search.

అప్పుడు బన్నీ ఇస్తే..ఇప్పుడు ఎన్టీఆర్ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   28 Oct 2015 10:30 PM GMT
అప్పుడు బన్నీ ఇస్తే..ఇప్పుడు ఎన్టీఆర్ ఇచ్చాడు
X
ఫోన్లో కబుర్లు మొదలవుతాయి.. తర్వాత చేతులు కలుస్తాయి.. మీటింగుల మీద మీటింగులు జరుగుతాయి.. కథా చర్చలు జరుగుతాయి. అంతా బాగానే ఉందనిపిస్తుంది. కానీ చివరికి సినిమా మాత్రం పట్టాలెక్కదు. ఇలా చర్చల దశలో ఆగిపోయే సినిమాలు చాలానే ఉంటాయి. డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కానీ.. మన ఇండస్ట్రీలో సినిమాల్ని డిసైడ్ చేసేది హీరోలే. నిర్ణయాధికారం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. హీరోల్ని శాసించే దర్శకులు చాలా కొద్దిమంది మాత్రమే. గోపీచంద్ మలినేని ఇంకా ఆ రేంజికి చేరలేదు. మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ.. హీరోల నిర్ణయం మీదే నడుస్తోంది అతడి బండి.

‘బలుపు’ లాంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్‌ తో సినిమా చేయాలని ఆశ పడ్డాడు గోపీ. కథ చెప్పాడు. బన్నీ కూడా ఓకే అన్నట్లే కనిపించాడు. కానీ.. గోపీకి హ్యాండ్ ఇచ్చేసి త్రివిక్రమ్ తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేశాడు. గోపీ.. రామ్ తో ‘పండగ చేస్కో’ తీశాడు. అది కూడా బాగానే ఆడింది. ఆ ఉత్సాహంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడు. తన గురువు మురుగదాస్‌ సహకారంతో కథ కూడా రెడీ చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ సీన్ కట్ చేస్తే.. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో సినిమా మొదలైంది. మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా సినిమా అనౌన్స్ చేశాడు గోపీ. మొత్తానికి అప్పుడు గోపీకి బన్నీ హ్యాండిస్తే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఇచ్చాడు చెయ్యి.