Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ నోట 'ఆచార్య' మాట

By:  Tupaki Desk   |   23 Aug 2021 6:03 PM IST
ఎన్టీఆర్‌ నోట ఆచార్య మాట
X
జెమిని టీవీలో నిన్న ప్రారంభం అయిన ఎవరు మీలో కోటీశ్వరులు షో కు గెస్ట్‌ గా రామ్‌ చరణ్ హాజరు అయిన విషయం తెల్సిందే. షో కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షో సందర్బంగా ఈ ఇద్దరు మాట్లాడుకున్న ప్రతి విషయం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామ్ చరణ్‌ గేమ్‌ ఆడుతున్న సమయంలో ఆచార్య పదం గురించిన ప్రశ్న వచ్చింది. ఆ సందర్బంగా సరైన సమాధానం చెప్పిన రామ్‌ చరణ్‌ తన ఇంట్లోనే ఆచార్య ఉన్నారు.. చిన్నప్పటి నుండి నాన్న చిరంజీవి గారిని ఆచార్య గానే మా కుటుంబం అంతా కూడా చూస్తామని చెప్పుకొచ్చాడు. చిరంజీవి గారు మీకు మాత్రమే కాకుండా మా అందరికి కూడా ఆచార్య వంటి వారే అంటూ ఎన్టీఆర్ కూడా చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి.

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా గురించి కూడా ఇద్దరి మద్య చర్చ జరిగింది. మా ఫ్యామిలీ ఎప్పటికి గుర్తుంచుకోదగ్గ సినిమాగా ఆచార్య నిలిచి పోతుందని రామ్‌ చరణ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఆచార్య సినిమా లో మొదట తాను పోషించిన పాత్ర 15 నిమిషాలు మాత్రమే అనుకున్నారు. కాని ఆ పాత్ర లో తాను నటించడం కోసం పాత్రను పెంచారు. నాకు అద్బుతమైన పాత్ర అందించిన మా.. నీ దర్శకుడు కొరటాల శివ గారికి కృతజ్ఞతలు అంటూ సభాముఖంగా కొరటాల శివ కు చరణ్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఆచార్య సినిమా లో నాన్న చిరంజీవి గారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఎప్పటికి కూడా ఆ సినిమా నిలిచి పోయి ఉంటుంది అంటూ చరణ్‌ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. ఆచార్య గురించి ఇద్దరి మద్య జరిగిన చర్చ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ తదుపరి సినిమా ఉండబోతుంది. ఇద్దరి కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. త్వరలో ప్రారంభం కాబోతున్న సినిమా కూడా మరో లెవల్ లో ఉంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.