Begin typing your search above and press return to search.
NTR: పులిబొమ్మ అందుకే వేసుకొచ్చా
By: Tupaki Desk | 13 March 2023 5:30 PM ISTరాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వేదికగా ఆస్కార్ అవార్డు దక్కింది. కీరవాణి స్వరపరచగా చంద్రబోస్ సాహిత్యం అందించి ఈ సాంగ్ ని మరో లెవెల్ కి తీసుకువెళ్లారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన ఈ సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడంతో ప్రతి ఒక్క భారతీయుడు ఉండే ఉప్పొంగుతోంది.
మరీ ముఖ్యంగా తెలుగువారైతే కాలరేగరేసుకుని రాజమౌళి మావాడు రా ఇది మా సినిమా రా అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఆస్కార్ అవార్డులు వేడుకకు ఈ సినిమాలో హీరోలుగా నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పెషల్ డ్రెస్సులలో వెళ్లారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడిచి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే నిజానికి ఎన్టీఆర్ ఈ వేదిక మీద రెడ్ కార్పెట్ మీద నడిచేందుకు స్పెషల్ గా ఒక పులి బొమ్మతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక సూట్ ధరించారు.
ఆ పులి బొమ్మ కరెక్ట్ గా ఎన్టీఆర్ భుజం మీదకు వచ్చి డ్రెస్ మొత్తాన్ని హైలైట్ అయ్యేలా చేసింది. అంతేకాదు ఈ పులి బొమ్మ మీద ఆస్కార నిర్వాహకులు కూడా ఫోకస్ పెట్టారంటే అది ఎంతలా అక్కడి వారందరిని ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న యాంకర్స్ లో ఒకరు ఈ పులి బొమ్మ ఎందుకు వేసుకొచ్చారు అని అడిగితే... దానికి ఎన్టీఆర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
ఎందుకంటే మీరు ఆర్ఆర్ఆర్ సినిమాలో పులిని చూశారు కదా... నాతో పాటు అది కూడా కనిపించింది అని అన్నారు. నిజానికి పులి మా ఇండియన్ నేషనల్ అనిమల్ అని నేను మా దేశ జాతీయ జంతువు బొమ్మను నామీద ధరించి రెడ్ కార్పెట్ మీద నడవడం నాకెంతో గర్వంగా ఉంటుందని ఎన్టీఆర్ చెప్పడం అక్కడ ఉన్న వారందరినీ ఆకర్షించింది. వెంటనే యాంకర్ కూడా స్పాంటేనియస్ గా మిమ్మల్ని చూస్తే మొత్తం గర్వపడుతోంది అంటూ కామెంట్లు చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.