Begin typing your search above and press return to search.

NTR 30: క్యాస్టింగ్ తోనే హైప్ పెంచేస్తున్నారు

By:  Tupaki Desk   |   1 April 2023 9:00 PM GMT
NTR 30: క్యాస్టింగ్ తోనే హైప్ పెంచేస్తున్నారు
X
జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ చేస్తున్న పాన్ ఇండియా సినిమా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ షూటింగ్ తాజాగా స్టార్ట్ అయ్యింది. భారీ బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఫస్ట్ డే షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతున్నారు.

సముద్ర తీరం బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ స్టోరీగా ఈ మూవీని కొరటాల శివ ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్ ఏంటి అనేది చెప్పేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ జోడిగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఇందులో మెయిన్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళి శర్మ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వీరితో పాటు ఇతర భాషలకు చెందిన స్టార్ క్యాస్టింగ్ ను ఈ మూవీ కోసం ఎంపిక చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ స్టార్ క్యాస్టింగ్ లో ఒక్కొక్కరిని టైం చూసుకొని కొరటాల శివ పోస్టర్స్ ద్వారా రివిల్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ని పెట్టబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది.

యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నాయి. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ నమ్మకంతో ఏడాది పాటు కొరటాల శివ కోసం ఎదురుచూశారు. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాని కొరటాల కూడా చాలా ఎఫెక్టివ్ గా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కార్గో షిప్ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు.

హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ షెడ్యూల్ తర్వాత టాకీ పార్ట్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్, విశాఖపట్నం, గోవా పరిసరాల్లో చేయబోతున్నారు. హైదరాబాదులో ప్రత్యేకంగా ఈ మూవీ కోసం ఒక పోర్టు సెట్ కూడా వేయడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.