Begin typing your search above and press return to search.

NTR 30: అనిరుధ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్

By:  Tupaki Desk   |   21 Nov 2022 7:31 AM GMT
NTR 30: అనిరుధ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్
X
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరపైకి రాబోతున్న ఎన్టీఆర్ 30 ప్రాజెక్టు పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి దాదాపు అన్ని భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఏమాత్రం తక్కువ కాకుండా ఉండాలని కూడా కొరటాల శివ ఆలోచిస్తున్నాడు. ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాపై అతను కాస్త ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నాడు.

ఇక పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధమయ్యే వరకు ఎన్టీఆర్ కూడా షూటింగ్ మొదలు పెట్టడానికి ఒప్పుకోలేదు. ఇక దాదాపు ఫైనల్ స్క్రిప్ట్ అయితే సెట్ అయింది. ఇక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫైనల్ అయ్యాడు. రీసెంట్ గా కొరటాల శివ యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ ను కూడా కలిశాడు. వీరి మధ్యలో స్క్రిప్ట్ కు సంబంధించిన అనేక రకాల విషయాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమా కోసం అనిరుద్ ఊహించని స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు వరకు కూడా ఈ సంగీత దర్శకుడు 4 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ వచ్చాడు.

అయితే ఇప్పుడు ఊహించని స్థాయిలో ఎన్టీఆర్ 30వ సినిమా కోసం పారితోషికం కని పెంచినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అనిరుద్ రవిచంద్ర ఎన్టీఆర్ సినిమా కోసం ఐదు నుంచి ఆరు కోట్ల మధ్యలో తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట.

అందుకు నిర్మాతల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. ఒక విధంగా అనిరుద్ ఆ రేంజ్ లో అడగడంలో ఎలాంటి తప్పులేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే అతను ప్రమోషన్స్ లో కూడా చాలా చలాకీగా పాల్గొంటూ ఉంటాడు. సినిమాలకు పాటలతోనే హైప్ పెంచేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.

ఇక అందులోనూ ఎన్టీఆర్ సినిమా కావడంతో అదిరిపోయే మ్యూజిక్ సెట్ చేస్తే ఎన్టీఆర్ తన స్టెప్పులతో పాటను మరొక లెవల్ కి తీసుకువెళ్తాడు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కోసం అనిరుద్ డిఫరెంట్ మ్యూజిక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అభిమానుల అంచనాలను ఈ కాంబినేషన్ ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.