Begin typing your search above and press return to search.

ఇప్పుడు మహేశ్ ముందున్న అతిపెద్ద రిక్వెస్ట్ అదే!

By:  Tupaki Desk   |   27 Dec 2021 4:19 PM IST
ఇప్పుడు మహేశ్ ముందున్న అతిపెద్ద రిక్వెస్ట్ అదే!
X
మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. హైదరాబాద్ .. గోవా .. దుబాయ్ .. స్పెయిన్ లలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే మహేశ్ బాబు చాలా కాలంగా మోకాలు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ సినిమా షూటింగును పూర్తి చేసిన తరువాతనే ఆయన సర్జరీ చేయించుకోవాలనుకున్నాడు.

అయితే ఏ రోజుకు ఆ రోజు నొప్పి ఎక్కువవుతూ ఉండటంతో, షూటింగును వాయిదా వేసుకుని ఆయన సర్జరీకి వెళ్లిపోయాడు. సర్జరీ చేయించుకున్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దాంతో త్వరలోనే షూటింగును మొదలుపెట్టేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యేలా చూస్తున్నారు. దాంతో 'సర్కారువారి పాట' సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనతో మేకర్స్ ఉన్నారు. కానీ అందుకు మహేశ్ సుముఖంగా లేడని అంటున్నారు.

ఇంతకుముందు మాదిరిగానే ఈ సినిమాను కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తే సరిపోతుందనీ, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయవలసిన అవసరం లేదని మహేశ్ బాబు అంటున్నాడట. అయినా మిగతా వాళ్లు ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా రిలీజ్ పట్ల పెద్దగా ఆసక్తిని .. ఉత్సాహాన్ని చూపించని మహేశ్ బాబును వాళ్లు ఎంతవరకూ ఒప్పించగలుగుతారనేది చూడాలి. ఇక ఈ సినిమా ఏ స్థాయిలో రిలీజ్ కానుందనేది ఆయన నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది.

పరశురామ్ ఈ సినిమాను తనదైన స్టైల్లో రూపొందిస్తున్నాడు. బ్యాంకు స్కామ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కథకి తగినట్టుగా యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయో, కామెడీ కూడా అలాగే ఉండనుంది. మహేశ్ బాబు - వెన్నెల కిశోర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ పగలబడి నవ్విస్తాయని అంటున్నారు. మహేశ్ బాబు - కీర్తి సురేశ్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనీ, వాళ్ల పెయిర్ కి మంచి మార్కులు పడతాయని చెబుతున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ముందుగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' కారణంగా ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు.