Begin typing your search above and press return to search.

ఇప్పుడిక కింగ్ నాగార్జున‌ వంతు!

By:  Tupaki Desk   |   29 Aug 2022 1:30 PM GMT
ఇప్పుడిక కింగ్ నాగార్జున‌ వంతు!
X
కింగ్ అక్కినేని నాగార్జున వార‌సుడు నాగ‌చైత‌న్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. రీసెంట్ గా 'మ‌నం' ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ష‌న్ లో దిల్ రాజు నిర్మించిన మూవీ 'థాంక్యూ'. భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ ఫ‌లితాన్ని అందించింది. ఏపీలోని కొన్ని ఏరియాల్లో ఈ మూవీ కోసం థియేట‌ర్స్ యాజామాన్యం ఒక‌టి టికెట్ కొంటే మ‌రొక‌టి ఫ్రీ అని ప్ర‌క‌టించినా ప్రేక్ష‌కులు పెద్ద‌గా స్పందించ‌లేదంటే ఈ మూవీ ఏ స్థాయిలో డిజాస్ట‌ర్ గా నిలిచిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక ఈ మూవీ త‌రువాత ఊహించ‌ని ఆఫ‌ర్ చైతూకి ల‌భించింది. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన సినిమా 'లాల్ సింగ్ చ‌డ్డా'. ఈ మూవీలో నాగ‌చైత‌న్య కీల‌క అతిథి పాత్ర‌లో బోడి బాల‌రాజుగా న‌టించిన విష‌యం తెలిసిందే. హాలీవుడ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'ఫారెస్ట్ గంప్‌' ఆధారంగా తెర‌కెక్కిన ఈమూవీ ఆగ‌స్టు 11న భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. ఇదే చైతూ న‌టించిన‌ తొలి బాలీవుడ్ మూవీ. ఈ మూవీతో సేఫ్ గా బాలీవుడ్ లో ల్యాండ్ అయిపోవ‌చ్చ‌ని భావించాడు.

కానీ బాయ్ కాట్ వివాదం కార‌ణంగా ఈ మూవీ ఇండియా వైడ్ గా డిజాస్ట‌ర్ అనిపించుకుంది. అమీర్ ఖాన్ న‌టించిన సినిమాల్లో అత్యంత భారీ డిజాస్ట‌ర్ గా ఈ మూవీ నిల‌వ‌డంతో తొలి సారి బాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన చైతూ ఆశ‌ల‌న్నీ ఆవిరైపోయాయి. ఇదిలా వుంటే ఇప్ప‌డు కింగ్ నాగార్జున కూడా బాలీవుడ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్ ల‌తో క‌లిసి కింగ్ నాగార్జున న‌టించిన లేటెస్ట్ హిందీ మూవీ 'బ్ర‌హ్మాస్త్ర‌'.

అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కించిన ఈ మూవీని మూడు భాగాలుగా తెర‌కెక్కించారు. ముందు 'బ్ర‌హ్మాస్త్ర' పార్ట్ 1 శివ గా సెప్టెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. నంది అస్త్ర‌గా ఈ మూవీలో నాగార్జున క‌నిపించ‌బోతున్నారు. ట్రైల‌ర్ లో చూపించిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. చాలా వ‌ర‌కు ట్రైల‌ర్ లో కింగ్ నాగ్ ని ప‌వ‌ర్ ఫుల్ గానే ద‌ర్శ‌కుడు ప్ర‌జెంట్ చేయ‌డం విశేషం. నాగార్జున‌కిది బాలీవుడ్ లో తొలి సినిమా కాదు.

వ‌ర్మ 'శివ‌', అమితాబ్ బ‌చ్చ‌న్ తో 'ఖుదాగ‌వా', అగ్నివ‌ర్ష‌, అనీల్ క‌పూర్ తో 'మిస్ట‌ర్ బెచారా', అక్ష‌య్ కుమార్ తో 'అంగారే', అజ‌య్ దేవ‌గ‌న్‌తో 'జ‌ఖ‌మ్‌', సంజ‌య్ ద‌త్ తో 'ఎల్ ఓసీ' వంటి సినిమాల్లో న‌టించి అక్క‌డి ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. విశేషం ఏంటంటే అమితాబ్ బ‌చ్చ‌న్ తో కింగ్ క‌లిసి న‌టించిన 'ఖుదాగ‌వా', అగ్నివ‌ర్ష‌, 'మ‌నం' సూప‌ర్ హిట్ లుగా, బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచాయి.

ఆ సెంటిమెంట్ ప్ర‌కారం 'బ్ర‌హ్మాస్త్ర‌'కు క‌లిసొచ్చే అవ‌కాశం వుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా చైతూ బాలీవుడ్ సినిమాతో భారీ ఫ్లాప్ ని సొంతం చేసుకున్న నేప‌థ్యంలో కింగ్ నాగ్ 'బ్ర‌హ్మాస్త్ర‌'తో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుని అమితాబ్ తో వున్న సెంటిమెంట్ ని మ‌రో సారి నిజం చేస్తాడా? అన్నది తెలియాలంటే సెప్టెంబ‌ర్ 9 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.