Begin typing your search above and press return to search.

ట్యాక్సీకి నోటా బ్రేక్ ?

By:  Tupaki Desk   |   27 Aug 2018 3:58 PM GMT
ట్యాక్సీకి నోటా బ్రేక్ ?
X
గీత గోవిందం ఈ రేంజ్ లో ఆడకపోయి ఉంటే తరువాత వచ్చే సినిమాల సమీకరణాలు అంచనాలు ఎలా ఉండేవో కానీ ఇప్పుడు మాత్రం ప్రతిదీ హాట్ టాపిక్ గా మారిపోతోంది. వంద కోట్ల గ్రాస్ ని అధికారికంగా క్రాస్ చేసి సక్సెస్ మీట్ లో చిరంజీవి స్టార్ అన్న మాటను నిజం చేసే దిశగా దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. ఇంకో పది రోజుల దాకా స్ట్రాంగ్ గా ఉండే పరిస్థితి కావడంతో వసూళ్ల ఫైనల్ ఫిగర్ ఊహకందడం లేదు. ఇక లెక్క ప్రకారం తరువాత రావాల్సిన సినిమా టాక్సీ వాలా. గీత గోవిందం కంటే ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ విడుదలయ్యాయి. అనూహ్యంగా గీత గోవిందం లైన్ లోకి వచ్చి మొత్తం తారుమారు చేసింది. సరే అదీ మంచికే జరిగింది అనుకుని పోనీ టాక్సీ వాలాను ఇప్పుడు విడుదల చేద్దామంటే నోటా రూపంలో బ్రేక్ పడేలా ఉంది. కారణం నోటా షూటింగ్ ఒకవైపు వేగంగా పూర్తి కావడం ప్లస్ ద్విభాషా చిత్రం కాబట్టి నిర్మాత జ్ఞానవేల్ రాజా అక్కడి భారీ విడుదలను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ చివరి వారంలో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. ఇది ఖచ్చితంగా అని చెప్పలేం కానీ టాక్ అయితే జోరుగా ఉంది.

దీనికి మరో కారణం కూడా చెన్నై మీడియా చూపిస్తోంది. తమిళ హీరో విజయ్ మురగదాస్ కాంబోలో రూపొందుతున్న సర్కార్ కూడా నోటా లాగే పొలిటికల్ థ్రిల్లర్. విజయ్ దేవరకొండను అతనితో పోల్చలేం కానీ సబ్జెక్టు పరంగా కొన్ని పోలికలు వచ్చే అవకాశం ఉంది. సర్కార్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. దీపావళి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నోటాను సర్కార్ కంటే ముందే తీసుకువచ్చి సక్సెస్ కొడితే ఒకవేళ సర్కార్ లో దీనితో పోలిన అంశాలు ఉన్నా నష్టం ఉండదు. అందుకే దీని గురించి సీరియస్ టాక్ నడుస్తోందట. మరోవైపు రిపేర్లు చేసి సిజి వర్క్ పూర్తి చేసాక టాక్సీ వాలా కమర్షియల్ గా బ్రహ్మాండంగా వర్క్ అవుట్ అయ్యే అవుట్ ఫుట్ లా కనిపించడంతో అల్లు ప్లస్ యువి సంస్థలతో పాటు విజయ్ దేవరకొండ ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. సో నోటా తర్వాత అయినా టాక్సీ వాలా రావడం ఖాయమే. చూస్తుంటే నోటా తర్వాత టాక్సీ వాలా నవంబర్ లోనో డిసెంబర్ లోనో వస్తే ఐదు నెలల కాలంలో మూడు సినిమాలు విడుదలైన క్రేజీ హీరోగా విజయ్ రేంజ్ పెరిగిపోతుంది. వీటికి సంబందించిన క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు.