Begin typing your search above and press return to search.

బ్రా వేసుకోలేదా? యువనటి దిమ్మదిరిగే జవాబు

By:  Tupaki Desk   |   16 July 2021 5:01 AM GMT
బ్రా వేసుకోలేదా? యువనటి దిమ్మదిరిగే జవాబు
X
మరాఠీ నటి హేమాంగి చేసిన పనికి ట్రోలింగ్ కు గురైంది. ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు కొందరు కామెంట్ల వర్షం కురిపించారు. ట్రోలింగ్ చేశారు. ఆమె దానికి ఘాటు సమాధానం చెప్పి షాక్ ఇచ్చింది.

మేమాంగి కవి అనే మరాఠీ నటి తన టాలెంట్ తో మరాఠీ, హిందీ సినిమాల్లో, టెలివిజన్ ప్రపంచంలో ప్రేక్షకుల్లో మంచి నటిగా ప్రశంసలు అందుకుంది. సోషల్ మీడియాలో ఈ నటి యాక్టివ్ గా ఉంటుంది.

నటి హేమాంగి ఇన్ స్టాగ్రామ్ లో ‘చపాతీ’ చేసే వీడియోను తాజాగా పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోలో బ్రా ధరించనందుకు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ముఖ్యంగా హేమాంగి తనని ట్రోల్ చేసే వారికి గట్టి సమాధానం ఇచ్చింది. సామాజిక సమస్యలను లేవనెత్తడంలో హేమాంగి ముందుంటుంది. ఎవరైనా నెటిజన్లు ట్రోల్ చేస్తే వారికి గట్టిగా సమాధానం ఇస్తుంది. ఎక్కడా వెనక్కి తగ్గదు.

హేమాంగి ఇటీవల ఒక వీడియో కోసం ట్రోల్ చేయబడింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె చపాతీ చేస్తున్న వీడియో షేర్ చేయడంతో కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. దీనికి గట్టిగా సోషల్ మీడియాలో హేమాంగి సమాధానం ఇచ్చింది. ‘హేమంగి తన ఇంట్లో, బయట లేదా సోషల్ మీడియాలో అండర్ గార్మెంట్ బ్రా ధరించాలా? లేదా అనేది తన ఆప్షన్ అని అన్నారు.

‘అవును నాకు రొమ్ములు ఉన్నాయి. పురుషుల మాదిరిగానే అవి ఉంటాయి. నేను పాలిచ్చే పెంచే జాతికి చెందిన దానిని కాబట్టి నా కాళ్లు, చేతులు కదిలేటప్పుడు నా వక్షోజాలు కదులుతాయి’ అని హేమంగి ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఇక ఆమె బూతు పద ప్రయోగాన్ని చేసింది. ‘బూ***స్’ అంటూ ఆడవారికి నమస్కరించాలని హితవు పలికింది.

ఇక హేమంగికి సపోర్టుగా మహిళలు కామెంట్లు చేస్తూ అండగా నిలిచారు. పురుషులు కనీసం దాన్ని అస్వాదించాలని.. నిశ్శబ్ధంగా ఉండాలని హితవు పలికారు. ఇంత దిగజారి కామెంట్లు చేయవద్దని పేర్కొన్నారు.

ఈ ట్రోలింగ్ పై దర్శకుడు ప్రవీణ్ టార్డే కూడా ఖండించారు. హేమంగిని ప్రశంసించాడు. రచయిత రసిక ఆగాషే కూడా హేమాంగిని ప్రశంసించారు.

ఇక హేమంగి పంచ్ లకు చాలా మంది మహిళా నటుల నుంచి ప్రశంసలు దక్కాయి. క్యా బాత్ హై హేమంగి అంటూ చాలా మంది నెటిజన్లు, అభిమానులు ఆమెకు మద్దతు తెలిపారు.