Begin typing your search above and press return to search.

జక్కన్నతో అంత ఈజీ కాదన్నారుః బుర్రా

By:  Tupaki Desk   |   21 March 2021 11:00 AM IST
జక్కన్నతో అంత ఈజీ కాదన్నారుః బుర్రా
X
ప్రస్తుతం టాలీవుడ్ లో మాటల రచయితల్లో సాయి మాధవ్ బుర్రా పేరు మారుమ్రోగి పోతుంది. అన్ని జోనర్‌ ల సినిమాలకు అద్బుతమైన మాటలను అందించడంలో ఆయన ఆరితేరి పోయాడు. ఛారిత్రాత్మకం.. పౌరాణికం.. జానపదం.. సాంఘీకం ఇలా సినిమా జోనర్ ఏదైనా కూడా కథ ఏదైనా కూడా ఆ కథకు బలం చేకూర్చే విధంగా మాటలను అందిస్తున్నాడు. సాయి మాధవ్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీ స్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ కు మాటలను అందిస్తున్న విషయం తెల్సిందే. రాజమౌళితో వర్క్‌ చేయ్యాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. సాయి మాధవ్‌ బుర్రా కూడా రాజమౌళితో వర్క్‌ చేసేందుకు ఇన్నాళ్లు ఆసక్తిగా ఎదురు చూశాడట.

ఆర్ఆర్‌ఆర్ సినిమాలో భాగస్వామ్యం అవ్వాలంటూ రాజమౌళి అడిగిన సమయంలో చాలా మంది ఆయనతో వర్క్‌ అంత ఈజీగా ఉండదని సాయి మాధవ్‌ ను హెచ్చరించారట. ఏది అంత ఈజీగా నచ్చడు ఆయనతో వర్క్‌ చేయాలంటే ఇతర సినిమాలను వదిలేయాల్సి ఉంటుందని అన్నారట. తాజాగా ఆ విషయమై సాయి మాధవ్‌ బుర్రా మాట్లాడుతూ ఆయనతో వర్క్‌ చేయడం చాలా బాగుందని అన్నాడు. తనకు ఏం కావాలో చాలా క్లారిటీగా ఉండే దర్శకుడు రాజమౌళి. సినిమాకు సంబంధించి చాలా క్లియర్‌ విజన్‌ ను కలిగి ఉండటం వల్ల వర్క్‌ చాలా సులభంగానే పూర్తి అవుతుందని సాయి మాధవ్‌ చెప్పుకొచ్చాడు. రాజమౌళి విజన్‌ ను అందుకుని వర్క్ చేస్తే ఆయనతో చాలా ఈజీ అంటూ బుర్రా సాయి మాధవ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.