Begin typing your search above and press return to search.

PS 2.. తెలుగు ప్రమోషన్స్ లైట్ తీసుకున్నారా..?

By:  Tupaki Desk   |   17 April 2023 11:30 PM IST
PS 2.. తెలుగు ప్రమోషన్స్ లైట్ తీసుకున్నారా..?
X
మణిరత్నం దర్శకత్వంలో ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా పార్ట్ 1 లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా వైడ్ భారీగా రిలీజ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా తన డ్రీం ప్రాజెక్ట్ గా చెబుతూ వచ్చిన మణిరత్నం బాహుబలి స్ఫూర్తితో ఈ భారీ సినిమాకు నడుం బిగించారు.

అయితే పార్ట్ 1 కేవలం తమిళ ఆడియన్స్ ను మాత్రమే మెప్పించగా మిగతా భాషల్లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్ అవుతుంది.

పార్ట్ 2 ని కూడా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్నా ప్రమోషన్స్ మాత్రం కేవలం తమిళంలోనే చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది.

కానీ పి.ఎస్ 1 తెలుగులో కూడా ప్లాప్ అవడంతో పి.ఎస్ 2 కోసం తెలుగు ప్రమోషన్స్ కూడా లైట్ తీసుకున్నారు. విక్రం, కార్తీ, త్రిష లాంటి వారికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అయినా కూడా పి.ఎస్ 2 కోసం తెలుగు ప్రమోషన్స్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు.

పి.ఎస్ 2 కి తెలుగు బిజినెస్ కూడా జరగలేదని టాక్. అందుకే ఇక్కడ రిలీజ్ విషయంలో మేకర్స్ ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 విషయంలో మణిరత్నం లెక్క తప్పిందని చెప్పొచ్చు. పి.ఎస్ 2 తో ఆ లెక్క సరి చేయాలని చూస్తున్నారు మణిరత్నం. మరి పి.ఎస్ 2 అయినా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.

పి.ఎస్ 1 సినిమా తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా రిలీజ్ చేశారు. కానీ పి.ఎస్ 2 రిలీజ్ ఇంకా పది రోజులే ఉన్నా కేవలం తమిళంలో ప్రమోషన్స్ చేస్తున్నారే తప్ప మిగతా భాషల్లో ప్రమోట్ చేయట్లేదు. బహుశా రిలీజ్ కి రెండు మూడు రోజుల ముందు ఏమైనా హడావిడి చేసే ఉద్దేశం ఉందో చూడాలి.