Begin typing your search above and press return to search.

మీ స్థాయి సూపర్ స్టార్ కు ఇది స‌రికాదు!

By:  Tupaki Desk   |   12 Sep 2022 11:30 PM GMT
మీ స్థాయి సూపర్ స్టార్ కు ఇది స‌రికాదు!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఛ‌రిష్మా.. స్టార్ డ‌మ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఒక హాలీవుడ్ స్టార్ రేంజ్ అత‌డిది. మ‌రో టామ్ క్రూజ్ లెవ‌ల్ అంటే అతిశ‌యోక్తి కాద‌నేది అభిమానుల‌ న‌మ్మ‌కం. కానీ మ‌హేష్ దానికి తూట్లు పొడుస్తున్నార‌న్న ఆవేద‌న ఇప్పుడు అభిమానుల్లో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.

తాజాగా అత‌డు బుల్లితెర సీరియ‌ళ్ల‌కు ప్ర‌మోష‌న్ చేస్తూ స‌ద‌రు తెలుగు టీవీ చానెల్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన‌సాగ‌డం స‌సేమిరా న‌చ్చ‌డం లేదు అభిమానుల‌కు. ఇది మీ స్థాయికి త‌గ‌దంటూ క‌ల‌త‌కు గురవుతున్నారు. సూప‌ర్ స్టార్ రేంజుకు ఇవి సూట్ కావ‌ని.. ఇలాంటి వాటిలో న‌టించ‌వ‌ద్ద‌ని కోరుతున్నారు.

ప‌ర‌మ రొటీన్ టీవీ సీరియ‌ళ్ల స్ట‌ఫ్ ని ప్ర‌మోట్ చేసేందుకు ఈ రేంజు స్టార్ అవ‌స‌ర‌మా? అన్న‌ది అంద‌రి ప్ర‌శ్న‌. ఒక సెక్ష‌న్ అభిమానులు అయితే ఈ విష‌యంలో చాలా సీరియ‌స్ గా ఉన్నారు. ప్ర‌స్తుతం అత‌డు వ‌రుస పాన్ ఇండియా చిత్రాల‌తో పాన్ ఇండియా స్టార్ గా అవ‌త‌రించే స‌మ‌యం. ఓవైపు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి త‌న‌ను పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్క‌రించేందుకు క‌స‌ర‌త్తును ముమ్మ‌రం చేశారు. అంత‌కంటే ముందే మ‌రో పాన్ ఇండియా సినిమాలో మ‌హేష్ ని చూపించేందుకు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ త‌న ప్లాన్ మొత్తాన్ని మార్చుకున్నారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌హేష్ అలాంటి టీవీ కార్య‌క్ర‌మాల ముఖ‌చిత్రంగా క‌నిపించ‌డం అవ‌మానంగా భావిస్తున్నారు కొంద‌రైతే. పైగా మ‌హేష్ తో పాటు ఆ టీవీ క‌మ‌ర్షియ‌ల్ లో సితార కూడా క‌నిపించడంతో అది ఏమాత్రం న‌చ్చడం లేదు.

మ‌హేష్ న‌టించిన ఇటీవ‌లి చిత్రాల‌పైనా ఒక సెక్ష‌న్ అభిమానులు అంత సంతృప్తిగా లేరు. అత‌డి స్థాయికి త‌గ్గ ఎంపిక‌లు క‌నిపించ‌డం లేద‌న్న ఆవేద‌న ఉంది. ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్లుగా ప్ర‌భాస్ - చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ వంటి వాళ్లు దూసుకుపోతుంటే మ‌హేష్ ఇంకా టీవీ క‌మ‌ర్షియ‌ల్స్ తో స‌రిపెడుతున్నాడ‌న్న ఆవేద‌న ప్ర‌తిసారీ వ్య‌క్త‌మ‌వుతోంది. ఇది ఫ్యాన్స్ కి పైకి క‌నిపించ‌ని మ‌నోవేద‌న‌లా మారింది.

ఆ కొత్త టీవీ షో కొత్త ప్రోమో పోస్టర్ ను ఆవిష్కరించ‌గా పోస్టర్ లో తమ ఫేవ‌రెట్ హీరో త‌న‌ కూతురు సితారతో పాటు క‌నిపించ‌డం నిజంగానే షాక్ కి గురి చేసింది. దీంతో ఒక అభిమాని త‌న వేద‌న‌ను బ‌హిరంగంగానే సామాజిక మాధ్య‌మాల్లో వెలిబుచ్చాడు. ``మీరు (మహేష్) పెద్ద స్క్రీన్ లపై అగ్గి రాజేయాల‌ని మేం కోరుకుంటున్నాం. ఇప్పుడు త్రివిక్రమ్ తో పని చేస్తున్నారు. త్వరలో భారతదేశపు అతిపెద్ద దర్శకుడు రాజమౌళితో కలిసి పని చేస్తారు. మేము మిమ్మల్ని చూడాలనుకుంటున్న కాన్వాస్ అది.

అయితే మళ్లీ ఈ టీవీ కమర్షియల్ లు చేస్తూ టీవీ సీరియళ్ల‌ పోస్టర్లలో నిలుస్తున్నారు. ఇది మీ స్థాయి సూపర్ స్టార్ కు సరిపోదు. దయచేసి ఇలా చేయడం మానేయండి`` అని మహేష్ అభిమానుల్లో ఒక వర్గం సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది. ద‌య చేసి వీటికి దూరం జ‌ర‌గండి అని ప‌దే ప‌దే ఫ్యాన్స్ అభ్య‌ర్థిస్తున్నారు. దీనిని సూప‌ర్ స్టార్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. త‌న అభిమానుల‌ను క‌ల‌త‌కు గురి చేయ‌డ‌నే అంతా భావిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.