Begin typing your search above and press return to search.

టీకా వేయ‌క‌పోతే షూటింగుల‌కు రానివ్వ‌రా?

By:  Tupaki Desk   |   22 May 2021 6:00 PM IST
టీకా వేయ‌క‌పోతే షూటింగుల‌కు రానివ్వ‌రా?
X
సెకండ్ వేవ్ క‌ల్లోలం అనంత‌రం అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో స‌న్నివేశం మారింది. క‌నీసం రెండు డోసుల టీకా వేయించుకుంటేనే ఇక‌పై మ‌నుగ‌డ సాగించే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వ్యాక్సినేష‌న్ తో మాత్ర‌మే ఆన్ లొకేష‌న్ ధీమా పెరుగుతుంద‌ని అంతా న‌మ్ముతున్నారు. దీంతో ప్ర‌తి ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో టీకాలు వేయించుకోవ‌డంపై దృష్టి సారించారు.

ఇక‌పై సెట్లోకి అడుగుపెట్టాలంటే టీకా వేయించుకున్న‌ట్టు ధృవీక‌ర‌ణ ప‌త్రం చూపించాల్సి ఉంటుంద‌ట‌. ఆ మేర‌కు ద‌క్షిణ భార‌త సినీ కార్మికుల స‌మాఖ్య (ఫెప్సీ) అధ్య‌క్షుడు సెల్వ‌మ‌ని కొత్త రూల్ ని ప్ర‌తిపాదించారు. ఇది సెట్లో ఉన్న అంద‌రి జాగ్ర‌త్త కోసం.. ప్ర‌స్తుత లాక్ డౌన్ ని ఈనెల 31 వ‌ర‌కూ పొడిగించారు కాబ‌ట్టి అప్ప‌టివ‌ర‌కూ సినిమా టీవీ షూటింగుల్లేవ్.

లాక్ డౌన్ ముగిశాక వ్యాక్సినేష‌న్ ఉన్న‌వారిని షూటింగుల‌కు అనుమ‌తిస్తామ‌ని సెల్వ‌మ‌ణి తెలిపారు. ప్ర‌తి ఆర్టిస్టు టెక్నీషియ‌న్ విధిగా వ్యాక్సినేష‌న్ చేయించుకోవాల‌ని అన్నారు. అన్న‌ట్టు సెల్వ‌మ‌ణి ప్ర‌తిపాదించిన రూల్ నే ఇటు టాలీవుడ్ కి వ‌ర్తింప‌జేస్తున్నారా? అయితే ఇక్క‌డ మాత్రం లాక్ డౌన్ తో సంబంధం లేకుండా టీవీ షూటింగులు సాగుతున్నాయి. ప‌లువురు కొద్దిరోజులు ఆగి తిరిగి షూటింగుల్ని పూర్తి చేసే ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు. అయితే జాగ్ర‌త్త కోసం వ్యాక్సినేష‌న్ చాలా ముఖ్య‌మ‌ని గ‌మ‌నించాలి. మ‌రో మూడు నాలుగు నెల‌ల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంద‌నే ప్ర‌జ‌లంతా ఆశిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వ్యాక్సినేష‌న్ కోసం టెండ‌ర్ల‌ను పిలిచారు కాబ‌ట్టి అదొక హోప్. తెలంగాణ సీఎం సినీకార్మికుల వ్యాక్సినేష‌న్ కోసం ఏదైనా ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తార‌నే హోప్ కూడా ఉంది. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.