Begin typing your search above and press return to search.

సౌత్ హీరోల‌పై ఉత్త‌రాది సూప‌ర్ స్టార్ల‌ జెల‌సీ?

By:  Tupaki Desk   |   23 April 2021 9:00 AM IST
సౌత్ హీరోల‌పై ఉత్త‌రాది సూప‌ర్ స్టార్ల‌ జెల‌సీ?
X
ఉత్త‌రాదిన సౌత్ స్టార్ హీరోల ఇమేజ్ పెరుగుతుంటే అక్క‌డ లోక‌ల్ స్టార్లు జెల‌సీ ఫీల‌వుతున్నారు. నిజానికి ఇటు ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు ఉత్త‌రాదినా మ‌న స్టార్లు చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే డార్లింగ్ ప్ర‌భాస్ తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లి హిందీ లో అతి పెద్ద మార్కెట్ ని అందుకుంటున్నాడు. తెలుగు ని మించి అక్క‌డి నుంచి వ‌సూళ్ల‌ను తెస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ఆ త‌ర్వాత య‌ష్ పెద్ద స‌క్సెస‌య్యాడు. ర‌జ‌నీ- క‌మ‌ల్ హాస‌న్ వంటి స్టార్ల‌కు ఉత్త‌రాదిన గొప్ప ఇమేజ్ ఉంది.

ఇక ఇటీవ‌ల చాలామంది సౌత్ స్టార్లు హిందీ మార్కెట్ పై ప‌డుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ కూడా హిందీ మార్కెట్ ని టార్గెట్ చేయ‌గా.. మునుముందు ఇత‌ర తెలుగు స్టార్ల‌తో పాటు అటు త‌మిళ స్టార్లు ఉత్త‌రాదిపై ఒక రేంజులోనే దృష్టి సారించారు. ఇప్ప‌టికే ప‌లువురు నార్త్ లో మెట్రోల‌ నుంచి చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను కొల్ల‌గొడుతున్నారు.

అయితే ఈ ప‌రిణామం ఉత్త‌రాది స్టార్ల‌కు రుచించ‌డం లేద‌ట‌. ర‌జనీతో మొదులుపెట్టి ప్ర‌భాస్ - య‌శ్ వ‌రుకు సౌత్ హీరోలు నార్త్ మీద దండ‌యాత్ర చేస్తూనే ఉన్నారు. అక్క‌డి క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొడుతూనే ఉన్నారు. అక్క‌డ జ‌నాల్లో కూడా మ‌నోళ్ల మీద క్రేజ్ రోజు రోజుకి పెరుగుతోంది. ఇది ఊహించ‌ని ప‌రిణామం. బాహుబ‌లి త‌ర్వాత అనూహ్య ప‌రిణామం అని విశ్లేషిస్తున్నారు.

అయితే నార్త్ హీరోల్ని మాత్రం సౌత్ జ‌నాలు పెద్ద‌గా ఆద‌రించ‌డం లేదు. ఉత్త‌రాది హీరోలు న‌టించిన సినిమాలేవీ ఇక్కడ పెద్దగా ఆడ‌టం లేదు. దీంతో ఇప్పుడు నార్త్ హీరోలు కూడా మ‌న నేటివిటీని దృష్టిలో పెట్టుకునే క‌థ‌లు రెడీ చేసుకుంటున్నారట‌.

ఇంత‌కుముందు హృతిక్ రోష‌న్ కి అంతో ఇంతో యాక్ష‌న్ సినిమాల‌తో తెలుగులో ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఖాన్ ల‌కు కొంత‌వ‌ర‌కూ ఉన్నా కానీ బంప‌ర్ హిట్లు అయ్యేది లేదు. కానీ న‌వ‌త‌రంలో ర‌ణ‌బీర్ క‌పూర్- ర‌ణ‌వీర్ సింగ్- షాహిద్ క‌పూర్ వంటి బాలీవుడ్ యంగ్ హీరోలు సౌత్ లో మార్కెట్ పెంచుకోడానికి తెగ ట్రై చేస్తున్న‌ట్లుగా బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కింగ్ ఖాన్ షారూక్ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీతో సౌత్-నార్త్ క‌నెక్టివిటీ ఉన్న పాయింట్ తో సినిమా చేస్తార‌న్న ఊహాగానాలు ఉన్నాయి.