Begin typing your search above and press return to search.

2020 ఎండ్ లో వెర్రెత్తించే స్నేక్ డ్యాన్స్ తో నోరా ట్రీట్

By:  Tupaki Desk   |   30 Dec 2020 3:30 AM GMT
2020 ఎండ్ లో వెర్రెత్తించే స్నేక్ డ్యాన్స్ తో నోరా ట్రీట్
X
2020 ఎండ్ లో బాహుబ‌లి మ‌నోహ‌రి నోరా ఫతేహి ఇచ్చిన స్నేక్ డ్యాన్స్ ట్రీట్ అదిరింది. తన తాజా వీడియోలో మేఘన్ థీ స్టాలియన్ ‘బాడీ ఓడీ’ డ్యాన్స్ ఛాలెంజ్ తో నెటిజ‌నుల్లో తుఫాన్‌ సృష్టిస్తోంది. డ్యాన్సుల్లో నోరా ఎన‌ర్జీని మ్యాచ్ చేయ‌డం ఇంకెవ‌ర‌కీ సాధ్యం కాదేమో! అనేంత‌గా స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేసింది.

#బాడీ వోడీ డ్యాన్స్ ఛాలెంజ్ లో భాగం ఇదంతా. ప్ర‌స్తుతం సెల‌బ్రిటీలంతా అంతర్జాతీయంగా పాపుల‌ర్ చేస్తున్న‌ ఒక డ్యాన్స్ వీడియో కి రీమిక్స్ స్టెప్పుల్ని పంచుకునేందుకు ఈ హ్యాష్ ట్యాగ్ ని ఆశ్ర‌యిస్తున్నారు. మేఘన్ ది స్టాలియన్ పాట `బాడీ ఓడీ` ర‌క‌ర‌కాల‌ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‌లలోనూ వైరల్ అయ్యింది.

కొరియోగ్రాఫర్ రజిత్ దేవ్ ‌తో నోరా స్టెప్పులేయడం ఆస‌క్తిక‌రం. ఎన‌ర్జిటిక్ నృత్య కదలికల ద్వారా ఎంతో ఆత్మ‌విశ్వాసంతో మ‌నోహ‌రి స్టెప్పులేయ‌డం క‌నిపిస్తోంది. ``కేటగిరీ బాడీ. 2020 చివరి డ్యాన్స్ వీడియో! వచ్చే ఏడాది కూడా మ‌రింత‌గా వెలిగిపోతుంది ... దాని కోసం వేచి ఉండండి`` అంటూ ఆమె వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. మునుముందు డిసెంబ‌ర్ 31 నైట్ పార్టీలో స్టెప్పుల‌తో నోరా ట్రీట్ ఉంటుంద‌నే దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. నోరా ఫతేహి `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`లో సరికొత్త అవతారంలో కనిపించనుంది.