Begin typing your search above and press return to search.

ఒంపు సొంపుల వ‌య్యారి స్వాంకీ కార్ లోంచి దిగ‌గానే..!

By:  Tupaki Desk   |   11 July 2021 7:30 AM GMT
ఒంపు సొంపుల వ‌య్యారి స్వాంకీ కార్ లోంచి దిగ‌గానే..!
X
ఒంపు సొంపుల సొగ‌స‌రి అలా స్వాంకీ కార్ లోంచి దిగ‌గానే..! క‌ళ్ల‌న్నీ అటువైపే. అలా సొంపుగా `హాయ్` చెబుతూ ఇంత‌లోనే షాపింగ్ పూర్తి చేసుకుని అప్ప‌టివ‌ర‌కూ ఆత్రంగా ఎదురు చూసే కెమెరా కంటికి `భాయ్` చెబుతూ ఆవిడ సాగించే విన్యాసాల ముందు ఇంకేదైనా నిల‌బ‌డుతుందా?

ల‌ల‌నామ‌ణి అలా థై స్లిట్ గౌనులో కార్ దిగుతుంటే 1-నేనొక్క‌డినే రిపీట్ సీన్ లాగే క‌ళ్ల‌న్నీ అక్క‌డే రిపీట్ రిపీట్ అన‌డం గ్యారెంటీ. ఇంత‌కీ ఈ అమ్మ‌డు ఎవ‌రో ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. మొరాకో నుంచి ముంబై వ‌ర‌కూ.. ముంబై నుంచి హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ వ‌ర‌కూ తెలుగు లోగిళ్ల వ‌ర‌కూ యువ‌త‌రంలో వీరాభిమానుల్ని సంపాదించుకుని ఓ ఆటాడుతున్న ఈ ముద్దుగుమ్మ నోరా ఫ‌తేహి. బాహుబ‌లి మ‌నోహ‌రిగా తెలుగు నాటా సుప‌రిచితం. ఒకే ఒక్క మ‌నోహ‌రి సాంగ్ తో అన్ని భాష‌ల‌కు ప‌రిచ‌యం అయిపోయిన నోరాకు అమాంతం క్రేజ్ పెరిగింది.

కుటుంబ పోష‌ణ‌లో భాగంగా ఆర్జ‌న కోసం 16 ప్రాయంలోనే లాట‌రీ టిక్కెట్లు అమ్మినా.. మాల్ లో సేల్స్ గాళ్ గా ప‌ని చేసినా నోరా మాత్రం కెరీర్ క‌ల‌ల‌ను విస్మ‌రించ‌లేదు. ఎట్ట‌కేల‌కు ఇండ‌స్ట్రీ బెస్ట్ డ్యాన్స‌ర్ గా భార‌తీయ చ‌ల‌న‌చిత్ర సీమ‌లో పాదం మోపి ఓ ఆటాడేస్తోంది.

ఇప్ప‌టికిప్పుడు హిందీ బుల్లితెర‌కు బాగా కావాల్సిన రియాలిటీ డ్యాన్సింగ్ క్వీన్ నోరానే. మ‌రోవైపు భుజ్- ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలోనూ నోరా కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. బుల్లితెర‌- వెండితెర - ప్ర‌క‌ట‌న‌ల రంగంలో భారీగా ఆర్జిస్తూ ఖ‌రీదైన కార్ల‌లో ముంబై లో షికార్లు చేస్తూ షాపింగులు చేస్తూ అబ్బో బోలెడంత హంగామా సృష్టిస్తోంది. ప్ర‌స్తుత లాక్ డౌన్ సీజ‌న్ లో నోరా ముంబై వీధుల్లో షికార్లు చేస్తూ బోలెడంత హ‌ల్ చ‌ల్ చేసింది. ఇప్పుడిలా కార్ లో షాపింగుకి దిగుతూ కెమెరా కంట ప‌డింది.