Begin typing your search above and press return to search.

ట్రెడిష‌న‌ల్ లుక్ లోనూ ఇంత హాట్ గానా?

By:  Tupaki Desk   |   30 Dec 2021 2:30 AM GMT
ట్రెడిష‌న‌ల్ లుక్ లోనూ ఇంత హాట్ గానా?
X
బాహుబ‌లి మ‌నోహ‌రి నోరా ఫతేహి డ్యాన్స్ కదలికలు అన్నివేళ‌లా యూత్ ని కిల్ చేస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఫ్యాషన్ ఎంపికలతోను తన అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. మెస్మరైజింగ్ బెల్లీ డ్యాన్స్ కు పేరుగాంచిన నోరా తరచుగా తన అందమైన .. బోల్డ్ చిత్రాలను పంచుకుంటుంది. తాజాగా ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ ఇన్ స్టాగ్రామ్ లో నోరా లేటెస్ట్ లుక్ ని రివీల్ చేశారు. మూడు ప్ర‌త్యేక‌మైన ఫోటోల‌ను అప్ లోడ్ చేశారు. వీటిలో ఆమె దేవకన్యలా కనిపిస్తోంది. అందమైన భారతీయ ట్రెడిష‌న్ ని ఆవిష్క‌రించే డిజైన‌ర్ దుస్తుల్లో నోరా త‌ళుక్కుమంది.

త‌న‌ అభిమానులు ఆమె కొత్త రూపాన్ని ఇష్టపడుతున్నారు. తాజా ఫోటోషూట్ కి “మెస్మరైజింగ్ లుక్” అంటూ కాంప్లిమెంట్లు ద‌క్కుతున్నాయి. ఫోటోగ్రాఫర్ రాధిక్ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను పంచుకుంటూ.. ``షాట్ ఇన్ టు ది లైట్.. ఒక ఫ్యాషన్ ఫిల్మ్ సెట్స్ లో చిత్రీకరించి``నట్లు చెప్పారు. నోరా ఫోటోగ్రాఫర్ రాధిక్ పై అభిమానులు తమ ప్రేమను కురిపిస్తున్నారు. ఈ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో 21000కు పైగా లైక్ లను సంపాదించాయి. ``నెయిల్డ్ ఇట్ మ్యాన్.. సూపర్బ్`` అని ఒక నెటిజ‌ను వ్యాఖ్యానించారు. “అద్భుతమైన నోరా” అంటూ మరొక అభిమాని పొగిడేశారు.

ఇంత‌కుముందు ఫిగర్-హగ్గింగ్ సిల్వర్ ప‌ర్పుల్ దుస్తులలో నోరా ఫోజులు అంతే వైర‌ల్ అయ్యాయి. ఆఫ్-ది-షోల్డర్ నెక్ లైన్ తో ఆక‌ట్టుకుంది. వీటిలో నోరా తెలుపు ఎరుపు మరియు నలుపు రంగు సీక్విన్ లతో రిఫ్లెక్టివ్ సీక్విన్డ్ అలంకారాల‌ దుస్తులలో గ్లామర్ గా కనిపించింది.

ప్రస్తుతం నోరా ఆమె నటించిన ఫుట్-ట్యాపింగ్ నంబర్ డాన్స్ మేరీ రాణిని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది. ఈ పాటను పంజాబీ గాయకుడు గురు రంధవా పాడారు. ఇది ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రెండో ఆల్బ‌మ్. ఇంతకుముందు గురు - నోరా 2020లో నాచ్ మేరీ రాణి అనే భారీ హిట్ సాంగ్ ను అందించారు. హార్డీ సంధు నాహ్..., రఫ్తార్ రచించిన బేబీ మార్వాకే మానేగీ అనేక ఇతర హిట్ మ్యూజిక్ వీడియోలలో నోరా కూడా భాగమైంది. ఇక కాన్ మాన్ 200 కోట్ల స్కామ్ ఎపిసోడ్స్ లోనూ నోరా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాన్ మ‌న్ సుకేష్ నుంచి ఖ‌రీదైన కానుక‌ల్ని నోరా అందుకుంది. ఇప్పుడు ఈడీ వాటిని ఎటాచ్ చేస్తోంది.