Begin typing your search above and press return to search.

రాధే బ్యూటీకి నోరా డ్యాన్స్ పాఠాలు నేర్పారా?

By:  Tupaki Desk   |   12 May 2021 5:30 AM GMT
రాధే బ్యూటీకి నోరా డ్యాన్స్ పాఠాలు నేర్పారా?
X
వ‌రుసగా స్పెష‌ల్ నంబ‌ర్ల‌తో పాపుల‌రైన నోరా ఫ‌తేహి.. శిష్యుల జాబితాలో లోఫ‌ర్ బ్యూటీ దిశా చేరింది. డ్యాన్స్ ల‌ విష‌యంలో దిశ ప‌టానీకి నోరా ఫ‌తేహి మాత్రం ఓ టీచ‌ర్ లా కినిపిస్తుందిట‌. దిశా ప‌టానీకి డాన్సుల్లో మెళ‌కువ‌లు తెలిసినా నోరా త‌న‌క‌న్నా గొప్ప డ్యాన్స‌ర్ అని నోరా ద‌గ్గ‌ర నుంచి ఎన్నో తెలియ‌ని విష‌యాలు..డాన్స్ మూవ్ మెంట్స్...సిగ్నేచ‌ర్ స్టెప్పులు నేర్చుకున్న‌ట్లు దిశా తెలిపింది.

``ఇద్ద‌రం స్నేహితులం కావొచ్చు..ఒక‌రి గురించి ఒక‌రు చెప్పుకోవ‌చ్చు. కానీ నాకు మాత్రం డాన్సు గురూ`` అంటూ నోరాకి ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని క‌ట్ట‌బెట్టింది దిశా ప‌టానీ. హాట్ హాట్ ఫోజుల్లో సైతం నోరాని అప్పుడ‌ప్పుడు అనుక‌రిస్తాన‌ని` తెలిపింది. మొత్తానికి స‌మ‌కాలీకులైనా..స్నేహితురాలే అయినా నోరాకి దిశా ఇచ్చిన స్థానం మాత్రం గొప్ప‌దే. అయితే ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం మాత్రం నాలుగేళ్లు ఉంది.

లోఫ‌ర్ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన దిశా ప‌టాని త‌ర్వాత పూర్తిగా బాలీవుడ్ లో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. లోఫ‌ర్ ఫెయిల‌య్యాక‌ తెలుగులో స‌రైన అవ‌కాశాలు రాలేదు. దీంతో అమ్మ‌డు ముంబైలోనే మ‌కాం వేసింది. ఇక నోరా ఫ‌తేహి టెంప‌ర్ లో ఐట‌మ్ భామ‌గా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి మ‌నోహ‌రి పాట‌తో అద్బుత ఫాలోయింగ్ పెంచుకుంది. కిక్-2- షేర్ త‌దిత‌ర‌ చిత్రాల్లో సైతం ఐటం పాట‌ల్లో న‌టించింది. బాలీవుడ్ లో ఓ సాకీ సాకీ పాటతో మ‌రింత పాపులారిటీ పెంచుకుంది. దిశా న‌టించిన రాధే మే 14న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా నోరాతో త్రోబ్యాక్ ఫోటోల‌ను దిశా షేర్ చేసింది.