Begin typing your search above and press return to search.

అయ్యో మనోహరి.. ఎంత కష్టం!!

By:  Tupaki Desk   |   24 Jun 2015 11:00 PM IST
అయ్యో మనోహరి.. ఎంత కష్టం!!
X
పైకి కనిపించే సొగసులు మాత్రమే మనకు తెలుసు. లోనున్న లొసుగులు తెలియవు. ఒక హీరోయిన్‌ ఒంటికి చీర అంటుకుని ఉన్నట్లు ఎంతో సెక్సీగా కనిపిస్తుంది. కాని అలా కదలకుండా ఎల్లోరా శిల్పానికి చీర చుట్టినట్లు ఉండాలంటే లోపల వేసుకునే పెట్టికోట్‌కు పిన్నులు కొడతారని మీకు తెలుసా? ఒక్కోసారి షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఈ పిన్నులు లోలపలే గుచ్చుకుంటుంటాయి. కాని పైకీ అవన్నీ తెలియదు. హీరోయిన్‌ అందాలు చూసి మనం లొట్టలేస్తాం. ఈ మధ్యనే ఇంతకంటే ఇబ్బందికరమైన సిట్యుయేషన్‌ ఇంకోటి జరిగింది.

మనోహరీ.. అంటూ బాహుబలి సినిమా కోసం ప్రభాస్‌ పాడుతుంటే.. తన్మయత్వంతో మిల్కీ బ్యూటి తమన్నాతో పాటు ఫారిన్‌ బాంబ్స్‌ అయిన నోరా ఫతేహి (టెంపర్‌ ఫేం), స్కార్లెట్‌ విల్సన్‌ (ఎవడు ఫేం) కూడా ఆడిపాడారు. మరి రాజమౌళి సినిమాలో ఐటెం సాంగులంటే మీకు పంచదార పూరీలు లేవా అని ముమాయత్‌ ఆడింది చూడండి.. ఆ రేంజులో ఉంటాయ్‌. పిల్లలకు చిన్నచిన్న పీలికలు కొన్ని కుట్టించారట. ఆ పిన్నులు కాస్త టైట్‌గా ఉండకపోవడం, ఊపుగా డ్యాన్సు వేయడం వలన ఊడిపోవడం.. ఇలా ఏదో జరిగి నోరా ఫతేహి టాప్‌ ఊడిపోయి క్రింద పడింది. వందల మంది యునిట్‌ మధ్యన ఎంత ఎంబరాసింగ్‌గా ఉంటుందో చూడండి.. వెంటనే పక్కనే ఉన్న తమన్నా తను కప్పుకున్న ఓ టవల్‌ను ఈమెపై కప్పేసిందట. కాని ఈ కష్టాలేమీ మనకు తెలియదు. ఎంచక్కా ధియేటర్లో బొమ్మ ఎంజాయ్‌ సేసేత్తామంతే..!!