Begin typing your search above and press return to search.

పొట్టి నిక్క‌రులో అగ్గి రాజేసిన మ‌నోహ‌రి

By:  Tupaki Desk   |   11 Dec 2020 11:57 AM IST
పొట్టి నిక్క‌రులో అగ్గి రాజేసిన మ‌నోహ‌రి
X
`బాహుబ‌లి` మ‌నోహ‌రి ఇన్ స్టాలో ఎంత స్పీడ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నే లేదు. నోరా ఫతేహి సోషల్ మీడియాలో ఒక సంచలనం. అత్యంత వేగంగా ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్న స్టార్ గా నోరా రికార్డుల‌కెక్కింది.

గొప్ప నర్తకిగా అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ని సంపాదించిన నోరా ఇన్ స్టా వేదిక‌లో తరచుగా తన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ మంట‌లు పెడుతుంది. ఇటీవ‌ల ఇన్ ‌స్టాగ్రామ్ లో కొన్ని అందమైన పోస్ట్ ‌లను షేర్ చేయ‌గా అభిమానులు నోరా హాట్ ‌నెస్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ ఫోటోల్ని వైర‌ల్ చేశారు. ఒంపు సొంపుల్ని వ‌డ్డించేందుకు ఏమాత్రం సిగ్గుప‌డ‌ని బ్యూటీ నోరా అన్న వ్యాఖ్య‌లు నిరంత‌రం వినిపించాయి.

లేటెస్ట్ పోస్ట్ ‌లో నోరా చిట్టి పొట్టి నిక్క‌రులో దుమారం రేపంది. బ్లూ డెనిమ్ బ్లాక్ టాప్ కాంబినేష్ గా బ్లాక్ మాస్కుతో హీట్ పెంచింది నోరా. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది.

నోరా ఫతేహి `నాచ్ మేరీ రాణి..` సాంగ్ 200 మిలియన్ వీక్షణలతో అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. నోరా ఫతేహి - గురు రాంధవా మ్యూజిక్ వీడియో నాచ్ మేరీ రాణి అక్టోబర్ 20 న విడుదలైనప్పటి నుండి ట్రెండింగ్ లో ఉంది. ఇటీవల స్మాషింగ్ హిట్ సాంగ్ ఇదే. యూట్యూబ్‌లో 20 కోట్ల వ్యూస్‌ను దాటింది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో 21 మిలియన్లకు పైగా వీక్షణలు.. విడుదలైన ఒక రోజులో 1.1 మిలియన్లకు పైగా లైక్‌లు.. 48 గంటల్లో యూట్యూబ్ చార్టులలో మొదటి స్థానంలో నిలిచింది. ఇది 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన వీడియో. విడుదలైన 30 రోజుల్లో నాచ్ మేరీ రాణి యూట్యూబ్ లో అత్యధికంగా శోధించిన కీవర్డ్ గా రికార్డుల‌కెక్కింది.

అమీర్ `సత్యమేవ జయతే` చిత్రం నుండి దిల్బార్,.. బట్ల హౌస్ నుండి ఓ సాకి సాకి .. స్ట్రీట్ డాన్సర్ 3 డి నుండి గార్మి ఇవ‌న్నీ నోరాకి పేరు తెచ్చాయి. త‌దుప‌రి అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్న‌ `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`లో కనిపించ‌నుంది.