Begin typing your search above and press return to search.

వీడియో: పింక్ గులాబీ న‌డిచొస్తోందిలా..

By:  Tupaki Desk   |   22 Dec 2020 12:30 PM IST
వీడియో: పింక్ గులాబీ న‌డిచొస్తోందిలా..
X
బాహుబ‌లి మ‌నోహ‌రి నోరా ఫతేహి రెగ్యుల‌ర్ ఫోటో వీడియో ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. నోరా ఫతేహికి సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. తరచుగా ఫోటోలు వీడియోలను ఇన్ స్టాగ్రామ్ ‌లో షేర్ చేస్తూ ఫాలోయింగ్ అసాధార‌ణంగా పెంచుకుంది ఈ విదేశీ భామ‌. రెగ్యుల‌ర్ యోగా.. జిమ్మింగ్ స‌హా డ్యాన్సింగ్ వీడియోలతో సాటి నాయిక‌ల కంటే ది బెస్ట్ ఫాలోయింగ్ ని తెచ్చుకుంద‌నే చెప్పాలి.

తాజాగా ఆమె ఒక వీడియోను షేర్ చేయ‌గా అది అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. నోరా అద్భుతమైన రెడ్ కార్పెట్ లుక్స్ విష‌యంలో ఎదురే లేదు. ఇటీవల ``ఫిల్మ్ ఫేర్ OTT అవార్డ్స్ 2020`` లో ఆమె తన అందమైన వస్త్రధారణతో అందరి తలలు తిప్పి త‌న‌వైపే చూసేలా చేసింది. షో స్టాప‌ర్ గా నిలిచింది ఈ డ‌స్కీ బ్యూటీ.

కార్ లో మ‌హారాణిలా ఠీవిగా దిగిన నోరా అటుపై వేదిక‌వైపు వెళుతూ.. హంస న‌డ‌క‌ల‌తో హొయ‌లు పోయిన వీడియో షేక్ చేస్తోంది. హ్యాపీ మండే బ్లెస్సింగ్ అంటూ.. అవార్డుల నైట్ కోసం ఆమె పింక్ అండ్ వైట్ టల్లే దుస్తులలో అందంగా రెడీ అయ్యి విచ్చేసింది. ఈ దుస్తులలో ఒక అసమానమైన పెప్పీ లుక్ క‌నిపిస్తోంది. ఆ వెండి మడమలు... చంకీ రింగులు .. కాంబినేన్ పింక్ డ్రాప్ చెవిరింగులతో స్టైలింగ్ గుండెల్ని ట‌చ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వీడియోలు ఇన్ స్టా వేదిక‌గా వైర‌ల్ గా మారాయి. ఆ వీడియోలో పింక్ గులాబీనో పింక్ తామ‌ర పుష్ప‌మో న‌డిచొస్తున్న‌ట్టుగా ఉంది! అంటూ అభిమానులు ఫిదా అయిపోతూ వ్యాఖ్యానిస్తున్నారు.

నోరా కెరీర్ సంగ‌తి చూస్తే... చార్ట్ బస్టర్ `నాచ్ మేరీ రాణి`తో అందరినీ ఆకట్టుకుంది. ఇది విడుదలైన కొన్ని నెలల తర్వాతా మ్యూజిక్ చార్టులో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదేగాక స‌ల్మాన్ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయ‌కుల సినిమాల్లో ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయ‌ని తెలిసింది. టీవీ రియాలిటీ వేదిక‌ల‌పైనా నోరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది.