Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : 'బాహుబలి' ఐటెం ఏమాత్రం తగ్గడం లేదు

By:  Tupaki Desk   |   2 Oct 2021 12:30 AM GMT
పిక్ టాక్‌ : బాహుబలి ఐటెం ఏమాత్రం తగ్గడం లేదు
X
బాహుబలి సినిమాలో ఐటెం సాంగ్ చేసి సౌత్ ఆడియన్స్ కు చాలా దగ్గర అయిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి. ఈ అమ్మడు తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తుందని ఆశించారు. కాని ఆ తర్వాత ఊపిరి సినిమాలో ఐటెం సాంగ్‌ చేసిన తర్వాత తెలుగు లో కనిపించలేదు. కాని హిందీలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. హిందీలో స్పెషల్‌ సాంగ్స్ తో పాటు హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ తన హాట్‌ ఫొటో షూట్‌ ను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. నెట్టింట ఈ అమ్మడి ఫొటోలు ఎప్పుడు కూడా వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

హిందీ బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఐటెం సాంగ్స్ తో అలరించిన ఈ అమ్మడు హాట్ ఫొటోలకు పెట్టింది పేరు అన్నట్లుగా మారిపోయింది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చాలా విభిన్నమైన కాస్ట్యూమ్స్ అవ్వడంతో పాటు ఆ కాస్ట్యూమ్స్ కు నోరా ఫతేహి ఇచ్చిన ఫోజ్‌ మరియు ఎక్స్ ప్రెషన్స్ సూపర్ గా ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంత అందగత్తెకు ఎందుకు బాలీవుడ్‌ లో టాప్ స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశం రావడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమాల్లో నటించే అన్ని ఫీచర్స్‌ ఈ అమ్మడిలో ఉన్నాయి కాని ఎందుకో ఈమెను మేకర్స్ దూరం పెడుతున్నారేమో అనిపిస్తుంది అంటూ కొందరు ఈ ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు. థైస్ ఎక్స్‌ పోజ్ చేస్తూ అందాల వింధు చేస్తున్న ఈ అమ్మడి గత ఫొటోలతో పోల్చితే ఈ ఫొటోలు మరింత అందంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.