Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ఐటెమ్‌గాళ్‌తో మాస్‌రాజా

By:  Tupaki Desk   |   7 April 2015 7:30 AM GMT
ఎన్టీఆర్‌ ఐటెమ్‌గాళ్‌తో మాస్‌రాజా
X
ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'టెంపర్‌'లో అదిరిపోయే ఐటెమ్‌నంబర్‌లో నర్తించింది నోరా ఫతేహి. మొరాకోకి చెందిన ఈ బ్యూటీ పూరీ వల్లే తెలుగు తెరకొచ్చింది. తొలి ఐటెమ్‌తోనే మెరుపుతీగలాగా నర్తిస్త్తోందన్న పేరొచ్చింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రంలోనూ ఓ పాటలో నర్తిస్తోంది అమ్మడు. అదే క్రమంలో ఈ భామ డ్యాన్సులకు ఫిదా అయిపోయిన మాస్‌ రాజా వెంటనే తన సినిమాలో ఓ అవకాశమిచ్చాడని టాక్‌.

రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కిక్‌ 2' చిత్రంలో నోరా ఫతేహికి అవకాశం ఇచ్చారు. ఇందులో ఐటెమ్‌ గీతంలో అమ్మడు అందాలు ఆరబోయనుందని తెలుస్తోంది. ఏదేమైనా ప్రతిభకు పట్టంగట్టడం అంటే ఇదే మరి. చక్కని అందం, మేని సొగసుల్లో విరుపులు, కుర్రకారును మైమరిపించే చాణక్యం.. ఐటెమ్‌ భామల్లో ఉంటే అవకాశాలు అవే వెంటపడి వస్తాయనడానికి ఈ అమ్మడే ఉదాహరణ. అయితే పూరి పరిచయం చేసిన ఐటెమ్‌ భామల్లో ముమైత్‌ ఖాన్‌కి వచ్చినంత మైలేజ్‌ వేరే ఏ భామకూ రాలేదు. అందులో దేవీ, విదేశీ ముద్దుగుమ్మలెందరో ఉన్నారు. ఎవరికీ అస్సలు ఛాన్సే లేకుండా పోయింది. నోరాకి మాత్రం వరుసగా అవకాశాలొస్తున్నాయి.