Begin typing your search above and press return to search.

గాయ‌కుడితో నోరా ఫ‌తేహి ప్రేమాయ‌ణం

By:  Tupaki Desk   |   12 Dec 2021 5:30 PM GMT
గాయ‌కుడితో నోరా ఫ‌తేహి ప్రేమాయ‌ణం
X
రంగుల ప్ర‌పంచంలో ప్రేమాయ‌ణాల గురించి చెప్పేదేముంది? ఇటీవ‌ల‌ ప్రేమ జంట‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. డేటింగులు పెళ్లిళ్లకు దారి తీస్తాయా? లేదా? అన్న ప‌క్క‌నబెడితే రిలేష‌న్ లో ఉన్నంత కాలం మాత్రం సాన్నిహిత్యాన్ని న‌చ్చిన‌ట్టు ఆస్వాధిస్తున్నారు. ఇటీవ‌లే విక్కీ కౌశ‌ల్ - క‌త్రిన జంట పెళ్లితో ఒక‌టైంది. ర‌ణ‌బీర్ - ఆలియా జంట‌.. అర్జున్ క‌పూర్ - మ‌లైకా పెళ్లి కోసం వెయిటింగ్.

తాజాగా మ‌రో జంట కెమెరా కంటికి చిక్కింది. బాహుబ‌లి మ‌నోహ‌రి నోరా ప‌తేహీ -గురు రంధావా అనే సింగ‌ర్ తో డేటింగ్ లో ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆ ఇద్ద‌రూ గోవా బీచ్ లో చిలౌట్ అవుతోన్న ఫోటోలు తాజాగా నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇది జ‌స్ట్ స్నేహ‌మేనా? ప్రేమ పావురాల విహారం అనుకోవ‌చ్చా? అంటూ గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. అదంతా ప‌క్క‌న‌బెడితే నెటి జ‌నులు మాత్రం వాళ్ల రిలేష‌న్ పై ఓ క‌న్ క్లూజ‌న్ కి వ‌చ్చేసారు. ఇద్ద‌రు డేటింగ్ లో ఉన్నారని జంట ముచ్చ‌ట‌గా ఉంద‌ని కామెంట్లు పెడుతున్నారు.

ఆలియాభ‌ట్-ర‌ణ‌బీర్ క‌పూర్ త‌ర్వాత పెళ్లి చేసుకోబోయేది ఈ జంటే నంటూ మెజారిటీ ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఈ ప్ర‌యాణం ఎంతవ‌ర‌కూ ముందుకు సాగుతుందో కాలమే నిర్ణ‌యించాలి. నోరా ప‌తేహీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. `బాహుబ‌లి` సినిమాలో మ‌నోహ‌రి పాట‌లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత బాలీవుడ్ లోనే బిజీ అయింది. గురు రంధావా బాలీవుడ్ సింగ‌ర్. చాలా హిందీ సినిమాల‌కు గాత్రాన్ని అందించారు. ఇంకా ఆయ‌న లిరిసిస్ట్..కంపోజ‌ర్..ప్రొడ్యూస‌ర్ కూడా. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీ సింగ‌ర్ల‌లో గురు రంధావా ఒక‌రిగా కొన‌సాగుతున్నాడు.

ఇక నోరా ప‌తేహీ ఇటీవ‌ల మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈడీ విచార‌ణ ఎదుర్కోంటున్న సంగ‌తి తెలిసిందే. ఓ వ్యాపార వేత్త‌ని మోసం చేసిన కేసులో సుకేష్ చంద్ర‌తో నోరా ప‌తేహికి ఉన్న సంబంధాలు కార‌ణంగా ఈడీ విచార‌ణ సాగుతోంది. నోరాకి సుకేష్ ఖ‌రీదైన కార్లు కొనిచ్చిన‌ట్లు ఇప్ప‌టికే బ‌య‌ట‌ప‌డింది. ఆమెతో పాటు జాక్వెలిన్ పెర్నాండేజ్ కూడా విచార‌ణ ఎదుర్కుంటుంది.