Begin typing your search above and press return to search.

మ‌నోహ‌రి అర‌బిక్ ఊప్స్

By:  Tupaki Desk   |   1 Dec 2018 4:36 AM GMT
మ‌నోహ‌రి అర‌బిక్ ఊప్స్
X
నోరా ఫ‌తేహి .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. బాహుబ‌లి చిత్రంలో మ‌నోహ‌రి .. అంటూ నోరా చేసిన నృత్యాల‌కు ఫిదా అయిపోయింది యూత్‌. ఐటెమ్ గీతాల స్పెష‌లిస్టుగా నోరాకు ఉన్న క్రేజు ఆ పాట త‌ర్వాత మ‌రింత‌గా రెట్టింపైంది. 2016-17 త‌ర్వాత నోరా కెరీర్ ప‌రంగా పూర్తి బిజీ అయిపోయింది. 2018లో రెండు భారీ చిత్రాల్లో ఐటెమ్ నంబ‌ర్ల‌తో అల‌రించింది ఈ విదేశీ బ్యూటీ. జాన్ అబ్ర‌హాం స‌త్య‌మేవ జ‌య‌తే చిత్రంలో దిల్‌బ‌ర్ దిల్ బ‌ర్ అంటూ సాగే రీమిక్స్ సాంగ్‌లో నోరా న‌ర్తించింది. ఈ పాట‌ను టీసిరీస్ రిలీజ్ చేసింది.

బెల్లీ డ్యాన్స్.. పోల్ డ్యాన్స్ స్పెష‌లిస్టు అయిన నోరా ఊపుల‌కు కుర్ర‌కారు ఫిదా అవ్వాల్సిందే. దిల్‌బ‌ర్ పాట‌కు సీజ‌ర్ గోన్‌స్లేవ్స్ కొరియోగ్ర‌ఫీ అందించారు. టిజా మోహ్‌ సినీ సంగీతం అందించ‌గా ఖ‌లీఫా లిరిక్ అందించారు. దిల్ బ‌ర్ మాతృక స‌శ్మితాసేన్ న‌టించిన సినిమా లోనిది. ఆద్యంతం అర‌బిక్ ఫ్లేవ‌ర్‌ లో సాగే పాట‌. ఇందులో నోరా బెల్లీ డ్యాన్స్ హైలైట్. ప్ర‌స్తుతం ఈ వీడియో సాంగ్ యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

నోరా డ్యాన్సింగ్ ట్యాలెంట్‌ కి యూత్ స‌లాం అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇటీవ‌లే బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ స్త్రీ చిత్రంలోనూ నోరా ఓ అదిరిపోయే ఐటెమ్ నంబ‌ర్‌తో ర‌క్తి క‌ట్టించింది. శ్ర‌ద్ధా కపూర్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. మునుముందు సౌత్‌ లో మ‌రిన్ని ఐటెమ్ నంబ‌ర్ల‌తో వేడి పెంచేందుకు నోరా ప్ర‌ణాళిక‌లు వేస్తోంద‌ట‌. అరేబియా గుర్రం తీరుగా డ్యాన్సుల్లో ఎనర్జీ చూపించే ప్ర‌తిభ నోరా సొంతం. అందుకే పోటీ ఎంత ఉన్నా.. ఈ అమ్మ‌డికి క్రేజు పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు.