Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మత్తెక్కిస్తున్నమనోహరి

By:  Tupaki Desk   |   11 Dec 2018 4:38 PM IST
ఫోటో స్టొరీ: మత్తెక్కిస్తున్నమనోహరి
X
నోరా ఫతేహి అనే కెనడా మోడల్ ని 'టెంపర్' సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' ఐటెం సాంగ్ ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశాడు డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఆ తర్వాత 'బాహుబలి' మనోహరీ పాటలో కూడా మెరిసిన ఈ బ్యూటీ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేససింది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో పాగా వేసింది.

'దిల్ బర్' అరబిక్ వెర్షన్ పాటను ఎఫ్నెయిర్ బ్యాండ్ తో కలిసిపాడడంతో పాటుగా డ్యాన్స్ చేసింది. నవంబర్ ఆఖరులో రిలీజ్ అయిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. రీసెంట్ గా అరబిక్ దిల్బర్ సాంగ్ షూట్ నుండి ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ప్రొఫెషనల్ అరబిక్ బెల్లీ డాన్సర్ లాగా కనిపిస్తోంది. బెల్లీ బటన్ కు పిన్.. తలపై అరబిక్ స్టైల్ టోపీ.. వీటన్నిటినీ మించిన హాటు ఎక్స్ ప్రెషన్ తో నెటిజనులను క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ ఫోటోకు ఒక్కరోజులోనే 3.26 లక్షల లైక్స్ వచ్చాయి.

నోరా ఫతేహీ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు.. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'భరత్' లో ఒక కీలక పాత్ర దక్కిందట. దాంతో పాటుగా ఒక ఐటెం సాంగ్ కూడా ఉందట. దీంతో పాటు జాన్ అబ్రహమ్ హీరోగా తెరకెక్కుతున్న 'బాట్లా హౌస్' సినిమాలో కూడా నటిస్తోంది.