Begin typing your search above and press return to search.

గత సీజన్ లో నోయల్.. ఈ సీజన్ లో జెస్సీ

By:  Tupaki Desk   |   14 Nov 2021 4:07 PM IST
గత సీజన్ లో నోయల్.. ఈ సీజన్ లో జెస్సీ
X
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 నుండి మోడల్ కం ర్యాంప్ వాక్ ట్రైనర్ జెస్సీ అనూహ్య పరిణామాల నడుమ హౌస్ నుండి బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినెట్ అవ్వడం అంటే అది కేవలం ప్రేక్షకుల ఓట్ల ద్వారా మాత్రమే. కానీ జెస్సీ మాత్రం ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా బయటకు రావడం విచారకరం. జెస్సీ గురించి మొదట్లో పెద్దగా ఎవరికి తెలియదు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ అతడి ఆట అందరికి నచ్చింది. అతడిని హౌస్ లో ఉంచడం కోసం పలు సార్లు నామినేషన్స్ లో ఉన్నాకుడా ప్రేక్షకులు సేవ్ చేశారు.

ప్రేక్షకుల మద్దతు ఉన్నా కూడా జెస్సీ కి ఆరోగ్యం సహకరించలేదు. దాంతో ఇప్పటికే అతడు బయటకు వెళ్ళాడు. అక్కడ అంత బాగానే ఉందని చెప్పి వైద్యులు సీక్రెట్ రూమ్ కు పంపించారు. అక్కడ నుండి ఏ క్షణం లో అయినా జెస్సీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యం గా అతడి ఆరోగ్యం మరింతగా క్షీణించినట్లుగా తెలుస్తోంది. దాంతో జెస్సీ మరిన్ని సమస్యలు ఎదుర్కోవడం మొదలు అయ్యింది. అందుకే బిగ్ బాస్ టీమ్ అతడిని బయటకు పంపించే నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు ఈ సీజన్ లో జెస్సీ జర్నీ ఇలా ముగుస్తుందని ఊహించలేదు. గత సీజన్ లో నోయల్ ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడం వల్ల బయటకు వెళ్ళిపోయాడు. గంగవ్వ కూడా హెల్త్ కారణాల వల్ల షో నుండి తప్పుకుంది. మళ్ళీ ఈ సీజన్ లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. జెస్సీ ని ప్రేక్షకుల బయటకు పంపకుండా ఇలా బయటకు వెళ్లిపోవడం దారుణం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ 5 లో జెస్సీ జర్నీ చాలా ఆసక్తిగా సాగింది. షన్ను మరియు సిరి లతో ఇతడి స్నేహం అందరి కి బాగా నచ్చింది. జెస్సీ ఎలిమినేషన్ తో ఈ వారం నామినేట్ అయిన వారు లక్కీగా అంతా సేఫ్ అయ్యారు.