Begin typing your search above and press return to search.

కుమారికి కోచ్ ఏమేం నేర్పిస్తాడో

By:  Tupaki Desk   |   30 Jun 2016 8:04 AM GMT
కుమారికి కోచ్ ఏమేం నేర్పిస్తాడో
X
కుమారి 21ఎఫ్ మూవీతో.. అనుకున్న దాని కంటే ఎక్కువగానే టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించింది హేభా పటేల్. దీంతో పాటు ఈడో రకం ఆడో రకం సక్సెస్ తర్వాత లక్కీ హ్యాండ్ అనే ట్యాగ్ ను కూడా తగిలించేసుకుంది. ఇప్పుడు అమ్మడి చేతిలో చెప్పుకునే సంఖ్యలోనే ప్రాజెక్టులున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన కూడా ఛాన్స్ దక్కించుకున్న హేభ.. ఓ సినిమాలో లీడ్ కేరక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే.

'నేను నా బాయ్ ఫ్రెండ్స్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హేభా పటేల్ పాత్ర చుట్టూనే స్టోరీ తిరగనుంది. ఇందులో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ పాత్రలను ఫామ్ లో ఉన్న కుర్రాళ్లతో చేయించనున్నారు. అయితే ఈ సినిమాలో నోయల్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడట. హీరోయిన్ హేభా పటేల్ కు, తనకు మధ్య ఓ ఇంట్రెస్టింగ్ ట్రాక్ ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు నోయల్. అయితే.. ఆ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ లో తాను ఒకడినని మాత్రం అనలేదు.

బాస్కెట్ బాల్ కోచ్ గా స్టోరీకి కీలకమైన పాత్రలో 'నేను నా బాయ్ ఫ్రెండ్స్' సినిమాలో కనిపించనున్నాడు నోయల్. కుమారి 21ఎఫ్ లో కూడా నోయల్ కు, హేభాకు మధ్య ఓ ట్రాక్ నడిచిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రేపిస్ట్ గా నటించిన నోయల్.. ఇందులో బాస్కెట్ బాల్ కోచ్ పాత్ర చేస్తున్నాడన్న మాట. మరి ఈ రేపిస్ట్ కోచ్ అంటే ఏమేం ట్రైనింగ్ ఇస్తాడో కదా!