Begin typing your search above and press return to search.

శ్రీలీల‌ చ‌క్రం భ‌లే తిప్పుతోందే?

By:  Tupaki Desk   |   8 Oct 2022 10:01 AM GMT
శ్రీలీల‌ చ‌క్రం భ‌లే తిప్పుతోందే?
X
హిట్ లేకుండా ఛాన్స్ ఎలా ద‌క్కించుకోవాలంటే యంగ్ బ్యూటీ శ్రీలీని ఫాలో అవ్వాల్సిందే? అందం..అభిన‌యంతో పాటు మరికొన్ని టెక్నిక్ లు ఉంటే ఛాలు ఛాన్స్ లు వాటంత‌ట అవే వ‌స్తాయి? అనిపిస్తుందా అంటే అవున‌నే తెలుస్తోంది. ఈ కుర్ర‌భామ భామ ఖాతాలో ఇంత వ‌ర‌కూ ఒక్క స‌క్సెస్ కూడా లేదు. ఇటీవ‌లే డెబ్యూ మూవీ 'పెళ్లి సంద‌డి' చిత్రంతో ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు అటుపై జోరు వేగంతో అవ‌కాశాలు చేజిక్కించుకుంటుంది.

ప్ర‌స్తుతం అమ్మ‌డి ట్రాక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. అలాంటి బిగ్ ఛాన్సెస్ అన్నింటిని ఒడిసిప‌ట్టుకుంది. ప్ర‌స్తుతం మాస్ రాజా ర‌వితేజ‌తో 'ధ‌మాకా'లో రొమాన్స్ చేస్తోంది. రాజా సినిమాలో రొమాన్స్ కి ఎలాంటి స్కోప్ ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ కోవ‌లో శ్రీలీల కెరీర్ ఆరంభంలోనే రొమాంటిక్ భామ అనే ట్యాగ్ ని సొంతం చేసుకుంటుంది.

ర‌వితేజ‌తో లెక్క‌కు మిక్కిలి రొమాంటిక్ స‌న్నివేశాల్లో చెల‌రేగుతోంది అనే టాక్ వైర‌ల్ అవుతోంది. అలాగే వారాహి బ్యాన‌ర్లోనూ ఓ సినిమాకి క‌మిట్ అయింది. 'జూనియ‌ర్' అనే సినిమాని తెలుగు..క‌న్న‌డ భాష‌ల్లో వారాహి నిర్మిస్తోంది. ఈ సినిమా అమ్మ‌డికి క‌న్న‌డ‌లో ఐద‌వ సినిమాగా నిలుస్తోంది. అలాగే 'అన‌గ‌న‌గా ఒక రోజు' అనే మ‌రో సినిమా కూడా చేస్తుంది.

ఈ మూడు గాక తాజాగా రామ్-బోయ‌పాటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోనూ ఛాన్స్ అందుకుంది. ఇవ‌న్నీ ఒక్క హిట్ కూడా లేకుండా చేజిక్కించుకున్న‌ అవ‌కాశాలు. శ్రీలీల‌కి ఇలా ఎలా సాధ్య‌మైంది? అందం..అభిన‌యం గ‌ల భామలు చాలా మందే ఉన్నారు . ట్యాలెంటెడ్ బ్యూటీలు కుప్పల కొద్ది ఉన్నారు? మ‌రి వాళ్లెవ్వ‌రికి రాని ఛాన్స్ ఈ భామ‌కి ఎలా? అంటే స‌మాధానం క‌ష్ట‌మే.

అదృష్ట‌మే అమ్మ‌డి ఇంటి త‌లుపు త‌ట్టిన‌ట్లు భావించాల్సిందే. ఇలా ల‌క్ తో పాటు...బ్యూటీ ఇండ‌స్ర్టీకి అవ‌స‌రమైన కొన్ని ర‌కాల టెక్నిక‌ల్స్ స్కిల్స్ పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయ‌ని స‌న్నిహితులు చెబుతుతున్నారు. త‌నలో ఆ ట్యాలెంట్ ని గుర్తించే న‌యా బ్యాన‌ర్లు అమ్మ‌డి వెంట క్యూ క‌డుతున్నాయ‌న్న‌ది ఓ భొగ‌ట్టా.

అలాగే ఇప్పుడున్న హీరోయిన్లద‌ర‌కంటే అద‌నంగా కొన్ని క్వాలిటీలు అమ్మ‌డిని ఆక‌ర్షించేలా చేస్తున్నాయ‌ని మ‌రికొంత మంది అంటున్నారు. కార‌ణాలు ఏవైనా హిట్ లేకుండా ఛాన్సులు అందుకోవ‌డం అమ్మ‌డికే చెల్లింద‌ని చెప్పొచ్చు. తెలివిగా ఇండస్ర్టీలో చ‌క్రం తిప్పుతూ అవ‌కాశాలు ఒడిసిప‌ట్టుకుంటోంది. అమ్మ‌డి జాబితాలో టైర్ -1 చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. బ్యూటీ చేతి రేఖ‌లు అలా ఉన్నాయి మ‌రి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.