Begin typing your search above and press return to search.

సినిమా గోల పక్కన పెట్టి ప్రశాంతంగా భాయ్‌..!

By:  Tupaki Desk   |   25 July 2022 4:45 AM GMT
సినిమా గోల పక్కన పెట్టి ప్రశాంతంగా భాయ్‌..!
X
బాహుబలి తో దక్కిన స్టార్ డమ్ ను ప్రభాస్ చక్కగా ఉపయోగించుకున్నాడు.. ఇంకా బాహుబలి క్రేజ్ ను ఉపయోగించుకుంటూనే ఉన్నారు. కేవలం ప్రభాస్‌ అని మాత్రమే కాకుండా పుష్ప తో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ను కూడా పాన్ ఇండియా స్టార్‌ గా ఎదగడానికి ఉపయోగించుకుంటున్నారు. కాని కేజీఎఫ్ స్టార్‌ యశ్‌ అలియాస్ రాఖీ భాయ్ మాత్రం అలా కనిపించడం లేదు.

కేజీఎఫ్‌ రెండు పార్ట్‌ లు కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్ 2 సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే రాబట్టింది. దాంతో పాన్ ఇండియా స్థాయిలో ఆయన స్టార్‌ డమ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో జాగ్రత్తగా కెరీర్‌ ను ప్లాన్ చేసుకుని రెండు మూడు పాన్ ఇండియా సినిమా లు చేస్తే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

కానీ ఇప్పటి వరకు యశ్‌ కేజీఎఫ్ తర్వాత సినిమా ను అధికారికంగా ప్రకటించలేదు. ఒకటి రెండు కథలు విన్నట్లుగా కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఆయన సినిమా ప్రారంభం గురించి ఎలాంటి స్పష్టత లేదు. రాఖీ భాయ్ గా యశ్‌ ను చూసిన జనాలు ఆయన నుండి మరిన్ని మాస్.. యాక్షన్‌ సినిమాలను చూడాలని ఆశిస్తున్నారు. కాని యశ్ మాత్రం ఇంకా కమిట్‌ అయిన దాఖలాలు కనిపించడం లేదు.

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇదే ఏడాది చివర్లో ఆయన ఎన్టీఆర్‌ తో సినిమా ను కూడా మొదలు పెట్టబోతున్నాడట. దర్శకుడు అంత బిజీ అవ్వగా హీరో యశ్ మాత్రం ఇంకా కేజీఎఫ్ సక్సెస్ ను ఎంజాయ్‌ చేసే పనిలోనే ఉన్నాడు అంటూ స్వయంగా అభిమానులు పెదవి విరుస్తున్నారు.

కేజీఎఫ్ 2 విడుదల అయినప్పటి నుంచి కూడా యశ్ పూర్తిగా సమయం ను ఫ్యామిలీకి కేటాయించాడు. తన ఇద్దరు పిల్లలు మరియు భార్య రాధిక తో కలిసి గడుపుతున్నాడు. ఫ్యామిలీ తో సమయం గడపడం మంచిదే కానీ ఇదే సమయంలో ఆయన తన తదుపరి సినిమాల గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది ఫ్యాన్స్ అభిప్రాయం.

కేజీఎఫ్‌ తో వచ్చిన క్రేజ్ తగ్గక ముందే మరో పాన్ ఇండియా సినిమా ను చేసి సక్సెస్ దక్కించుకోవాలి.. అది సక్సెస్‌ కాకుంటే మరోటి చేయాలి. అంతే కాని ఇంకా వెయిటింగ్‌ లో పెట్టడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.