Begin typing your search above and press return to search.
అడ్రెస్ లేని సౌత్ క్వీన్స్
By: Tupaki Desk | 4 July 2019 4:42 PM ISTఐదేళ్ల క్రితం కంగనా రౌనత్ టైటిల్ పాత్రలో వచ్చిన క్వీన్ సంచలన విజయం అంత సులభంగా మర్చిపోయేది కాదు. విమెన్ సెంట్రిక్ మూవీస్ లో ఓ కొత్త ట్రెండ్ కి నాంది పలికిన క్వీన్ వసూళ్ల పరంగా కూడా ఔరా అనిపించింది. అప్పటినుంచి దీన్ని వివిధ భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆలస్యమైనా తెలుగు తమిళ్ కన్నడ మలయాళంలో ఒకేసారి నలుగురు వేర్వేరు హీరోయిన్లతో షూటింగ్ మొదలుపెట్టడం ఏవేవో అవాంతరాలతో బ్రేకులు పడి ఎట్టకేలకు పూర్తి కావడం అయిపోయింది.
ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ లో తమన్నా లీడ్ రోల్ చేయగా టైటిల్ దటీజ్ మహాలక్ష్మిగా ఫిక్స్ చేశారు. నీలకంఠ దాదాపుగా సినిమా మొత్తం తీయగా ఆయన తప్పుకున్నాక బాలన్స్ ఉన్న కొంత భాగాన్ని క్రెడిట్ తనకు ఇవ్వకూడదు అనే కండిషన్ మీద కల్కి దర్శకుడు ప్రశాంత్ వర్మ పూర్తి చేసి ఇచ్చాడు. ఇదంతా జరిగి సుమారు ఆరు నెలలయింది
ఇక అక్కడి నుంచి దీని అడ్రెస్ కరువైంది. తమిళ్ లో కాజల్ అగర్వాల్ తో కన్నడలో పరుల్ యాదవ్ మలయాళంలో మంజిమా మోహన్ తో వేర్వేరు దర్శకులు ఎట్టకేలకు దీన్ని పూర్తి చేశారు. కానీ రిలీజ్ విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కవెస్తున్నారో అర్థం కావడం లేదు. నిర్మాణాంతర కార్యక్రమాల తర్వాత ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదని కొంత ప్రమోషన్ చేసి హైప్ వచ్చాక అప్పుడు అమ్మే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని టాక్ వచ్చింది. అదీ అమలు కాలేదు. ఇంతకీ ఈ నలుగురు సౌత్ క్వీన్స్ తెరమీదకు వస్తారా రారా అనే అనుమానాలు మొదలైపోయాయి. ఈ ముద్దుగుమ్మలు కూడా ఎప్పుడు మీడియాతో మాట్లాడినా ఈ సినిమా ప్రస్తావన ఏమాత్రం రాకుండా జాగ్రత్త పడుతూ మిగిలిన ముచ్చట్లు చెబుతున్నారు. అసలేం జరుగుతోందో మరి