Begin typing your search above and press return to search.

'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌' వున్న‌ట్టా.. లేన‌ట్టా?

By:  Tupaki Desk   |   9 Nov 2022 11:30 PM GMT
భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌ వున్న‌ట్టా.. లేన‌ట్టా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ 'అజ్ఞాత‌వాసి' త‌రువాత దాదాపు మూడున్న‌రేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా వుంటూ జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల్లో యాక్టీవ్ గా పాల్గొన్నారు. ఆ త‌రువాత అభిమానుల వొత్తిడి కార‌ణంగా మూతున్న‌రేళ్ల విరామం త‌రువాత కెమెరా ముందుకొచ్చారు. ప‌వ‌న్ మూడున్న‌రేళ్ల త‌రువాత న‌టించిన రీమేక్ మూవీ 'వ‌కీల్ సాబ్‌'. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్‌' ఆధారంగా రీమేక్ అయిన ఈ మూవీ ప‌వ‌న్ కు మంయి క‌మ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచి మంచి విజ‌యాన్ని అందించింది.

ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రిష్ తో తొలి పాన్ ఇండియా మూవీగా 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'కు శ్రీ‌కారం చుట్టారు. ఈ సినిమా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వుండ‌గానే హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌'ని ప్ర‌క‌టించారు.

ఈ మూవీ ప్ర‌క‌టించి దాదాపు మూడేళ్లు కావ‌స్తోంది. హ‌రీష్ శంక‌ర్ ఈ ప్రాజెక్ట్ కోస‌మే ఎదురుచూస్తున్నాడు. ప‌వ‌న్ ఎప్పుడు క‌రుణిస్తే అప్పుడు సినిమాని ప‌ట్టాలెక్కించాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తూ మ‌రో హీరోని ట‌చ్ చేయ‌డం లేదు.

అమితే ముందున్న 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' ప్రాజెక్ట్ ఆగుతూ సాగుతూ వుండ‌టంతో హ‌రీష్ శంక‌ర్ క్రేజీ ప్రాజెక్ట్ 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌'పై ఎలాంటి అప్ డేట్ రావ‌డంలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ వున్న‌ట్టా లేన‌ట్టా? అనే అనుమానాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ ని కూడా ఇప్ప‌టికే విడుద‌ల చేసిన హ‌రీష్ శంక‌ర్ ఈ ప్రాజెక్ట్ కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూస్తున్నాడు. కానీ ప‌వ‌న్ నుంచి దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న రావ‌డం లేదు.

దీంతో ఇక ఈ ప్రాజెక్ట్ ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మ‌నే కామెంట్ లు వినిపించ‌డం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ ప్రాజెక్ట్ పై ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

త్వ‌ర‌లో ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్న ప‌వ‌న్ 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌' ని ఎన్నిక‌ల అనంత‌రం అంటే 2024లో ప‌ట్టాలెక్కిద్దామ‌ని చెప్పిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌. ఇదే నిజ‌మైతే హ‌రీష్ శంక‌ర్ అర్జంట్ గా మ‌రో హీరోను చూసుకోవ‌డం మంచిద‌ని, బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్ ని ఫైన‌ల్ చేసుకోవ‌డం బెట‌ర్ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయ‌ట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.