Begin typing your search above and press return to search.

అప్‌ డేట్‌ లేదంటున్న క్రిష్‌.. పవన్‌ ఫ్యాన్స్‌ నిరాశ

By:  Tupaki Desk   |   29 Aug 2020 5:00 AM IST
అప్‌ డేట్‌ లేదంటున్న క్రిష్‌.. పవన్‌ ఫ్యాన్స్‌ నిరాశ
X
మరికొన్ని రోజుల్లో పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే రాబోతుంది. ఆ రోజు వకీల్‌ సాబ్‌ చిత్రం టీజర్‌ తో పాటు క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ చేయబోతున్న 'విరూపాక్ష' సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. కాని క్రిష్‌ నుండి ఇప్పటి వరకు ఎలాంటి హడావుడి లేకపోవడంతో ఈసారి క్రిష్‌ నుండి ఎలాంటి అప్‌ డేట్‌ రావడం లేదని అనిపిస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ తో సినిమా ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా ఆగిపోయింది. వచ్చే ఏడాది వరకు క్రిష్‌ పవన్‌ మూవీ పట్టాలెక్కే అవకాశం లేదు. కనుక సినిమా అప్‌ డేట్‌ ఇవ్వడానికి ఏమీ లేదంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ డేట్లు ఇవ్వడానికి సమయం పట్టనున్న కారణంగా క్రిష్‌ ఇటీవలే వైష్ణవ్‌ తేజ్‌ రకుల్‌ ప్రీత్‌ జోడీగా ఒక సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు. కేవలం మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలని ఆ వెంటనే పవన్‌ మూవీని మొదలు పెట్టాలని క్రిష్‌ అనుకుంటున్నాడట. అందుకే ఇప్పుడు పవన్‌ మూవీకి సంబంధించిన విషయాలను క్రిష్‌ పట్టించుకునే పరిస్థతి లేదు.

పవన్‌ బర్త్‌ డే కానుకగా ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏమీ ఉండక పోవచ్చు అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ తో మొఘలుల కాలం నాటి కథతో క్రిష్‌ సినిమాను తీయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో పవన్‌ రాబిన్‌ హుడ్‌ తరహా పాత్రను చేయబోతున్నాడు. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఈ సినిమాలో నటించబోతుంది. తెలుగు మరియు హిందీలో విడుదల చేయబోతున్నారట.