Begin typing your search above and press return to search.
అక్కడి హిట్లొచ్చినా.. ఇక్కడ దూరమే
By: Tupaki Desk | 5 Nov 2015 5:00 PM ISTఓ హీరోయిన్ 3 నెలల్లో 3 బ్లాక్ బస్టర్స్ సాధిస్తే.. ఆమె క్రేజ్ ఎలా ఉంటుంది ? దర్శకులు - నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టేయరూ. అలాగే ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న హీరోలకు అరుదైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తే.. మిగిలిన స్టార్స్ కి కూడా ఆమే ఫస్ట్ ఛాయిస్ అవుతుంది. పక్క భాషల నుంచి కూడా ఆఫర్స్ వెల్లువెత్తుతాయి. అందులోనూ సెంటిమెంట్స్ రాజ్యం చేసే ఫిలిం ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ చాలా విపరీతంగా ఉంటుంది.
కానీ మళయాళీ భామ నయనతారకు డిఫరెంట్ సిట్యుయేషన్ ఎదురవుతోంది. తని ఒరువన్ - మాయా - నానుం రౌడీ దాన్ చిత్రాలతో.. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది నయన్. దీంతో ఇప్పుడామె పేరు కోలీవుడ్ లో మార్మోగిపోతోంది. నెంబర్ వన్ హీరోయిన్ నయనతారే అంటు తమిళ జనాలు నీరాజనాలు పలికేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో 3 తమిళ సినిమాలుండగా.. అన్నీ ఫినిషింగ్ దశలోనే ఉండడం గమనించాల్సిన విషయం. సాధారణంగా ఇలా ఇతర భాషల్లో హిట్స్ కొట్టిన హీరోయిన్ ని, వెంటనే బుక్ చేసేస్తారు టాలీవుడ్ డైరెక్టర్లు. కానీ నయన్ కి తెలుగు నుంచి ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు. దీనికి కారణం.. లేటెస్ట్ మాయ మినహా.. అంతకుముందొచ్చిన రెండు చిత్రాలు నిరాశపరిచాయి. కృష్ణం వందే జగద్గురం - అనామిక మూవీస్ తో తెలుగులో ఈమె కెరీర్ కి బ్రేక్ పడింది.
ఒకే ఒక ఊరట నిచ్చే విషయం ఏంటంటే.. మారుతీ - వెంకీ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో హీరోయిన్ గా నయన్ ని ఎంపిక చేయడం. ఇది హిట్ అయితే... నయన్ ఫేట్ లో మార్పులొచ్చే ఛాన్సులున్నాయి.