Begin typing your search above and press return to search.

థియేటర్ల కోసం తంటాలు పడుతున్న పేట!

By:  Tupaki Desk   |   6 Jan 2019 1:30 AM GMT
థియేటర్ల కోసం తంటాలు పడుతున్న పేట!
X
టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి సీజన్ ఎప్పుడూ ప్రత్యేకమైనదే.. ఎందుకంటే బడా స్టార్లు మాత్రమే పోటీ పడే ఈ సీజన్లో వందలకోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. మూడు స్ట్రెయిట్ సినిమాలతో పాటుగా ఒక తమిళ డబ్బింగ్ సినిమా కూడా పోటీలో ఉంది. 'ఎన్టీఆర్ కథానాయకుడు' జనవరి 9 న.. 'పేట' 10 తారీఖున.. 'వినయ విధేయ రామ' 11 వ తేదీన.. 'ఎఫ్ 2' చివరిగా 12 న రిలీజ్ కానున్నాయి.

అన్ని సినిమాలలో ట్రేడ్ వర్గాలు గానీ.. ప్రేక్షకులు గానీ మొదటి వోటు మాత్రం రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' కు వేస్తున్నారు. మాస్ పల్స్ తెలిసిన బోయపాటి శ్రీను దర్శకుడు కావడం అందుకు ఒక కారణం అయితే 'రంగస్థలం' విజయంతో చరణ్ ఊపు మీద ఉండడం మరో కారణం. నాలుగు సినిమాల్లోనూ ఎక్కువ థియేటర్లు కూడా ఈ సినిమాకే దక్కనున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' కూడా చరణ్ సినిమాకు అన్ని విషయాల్లో గట్టి పోటీ ఇస్తోంది. సీజన్లో రిలీజ్ కానున్న మొదటి సినిమా కావడంతో థియేటర్లు మొదటి రోజు ఎక్కువ దక్కినా మెల్లగా ఇతర సినిమాలకు ఇచ్చేయాల్సి ఉంటుంది. ..

ఇక వెంకటేష్ - వరుణ్ తేజ్ ల సినిమాకు ప్రోడుసర్ దిల్ రాజు కాబట్టి థియేటర్ల సమస్య లేదుగానీ చరణ్.. బాలయ్య సినిమాలతో పోలిస్తే బజ్ కాస్త తక్కువగానే ఉంది. కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి మంచి ఛాన్సు ఉంది. ఈ పోటీలో ఇప్పుడు బజ్ తక్కువ ఉండేది.. థియేటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో దక్కనిది రజనీకాంత్ 'పేట'. అసలే మిగతా సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకేక్కినవి కావడంతో పేట కు థియేటర్లు ఇచ్చేందుకు మిగతా వారు ఒప్పుకోవడం లేదట. దీంతో తక్కువ స్క్రీన్స్ తో నే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

ఒకప్పుడు రజనీ సినిమా రిలీజ్ అవుతుందంటే టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తమ సినిమా రిలీజ్ విషయంలో ఆలోచించేవారు. వరస ఫ్లాపులతో ఇప్పుడు తెలుగులో రజనీ మార్కెట్ తగ్గింది. '2.0' ప్రత్యేకమైన సినిమా కాబట్టి పక్కన బెడితే.. 'పేట' తెలుగు వెర్షన్ రైట్స్ చాలా తక్కువ రేటుకు అమ్ముడు పోవడం కూడా రజనీ ప్రెజెంట్ మార్కెట్ ను సూచిస్తోంది. ఏదేమైనా సంక్రాంతి సినిమాల మధ్యలో పొంగల్ హీరో శాండ్ విచ్ అయ్యేలా ఉన్నాడు.