Begin typing your search above and press return to search.

తమన్ ఏం పాపం చేశాడు త్రివిక్రమ్ సార్?

By:  Tupaki Desk   |   20 May 2018 1:49 PM IST
తమన్ ఏం పాపం చేశాడు త్రివిక్రమ్ సార్?
X
ఒక కొత్త సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ అయిందంటే దాని మీద దర్శక నిర్మాతలతో పాటు సంగీత దర్శకుడు.. ఛాయాగ్రాహకుడి పేర్లు కచ్చితంగా ఉంటాయి. ఇంకా మరికొందరు కీ టెక్నీషియన్స్ పేర్లు కూడా వేస్తారు. అప్పటికింకా సాంకేతిక నిపుణులు ఖరారు కాకపోయి ఉంటే తప్ప ముఖ్యమైన వాళ్ల పేర్లు కచ్చితంగా ఉండాల్సిందే. కానీ నిన్న రిలీజైన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఫస్ట్ లుక్ పోస్టర్ మీద సంగీత దర్శకుడు తమన్ పేరు కనిపించలేదు. అలాగే సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ పేరుకు కూడా చోటు లేకపోయింది. కేవలం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ పేర్లు మాత్రమే వేసుకున్నారు. ఈ సినిమాకు అనేక తర్జన భర్జనల తర్వాత సంగీత దర్శకుడిగా తమన్ పేరు ఖరారైంది.

చిత్రానికి తనను ఓకే చేయడంతో తమన్ చాలా సంబరపడిపోయాడు. చాలా ఉత్సాహంగా ఈ సినిమా పనులు మొదలుపెట్టేశాడు. ఆల్రెడీ త్రివిక్రమ్‌తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. అలాంటిది ఫస్ట్ లుక్ పోస్టర్లో తమన్‌ కు చోటు లేకపోవడమేంటో? అందులో ఏమైనా పొరబాటు జరిగిందని అనుకుందాం. కానీ ఈ రోజు లాంచ్ చేసిన మోషన్ పోస్టర్లోనూ తమన్ పేరు కనిపించలేదు. ఈ పోస్టర్‌ కు తమన్ కూల్‌ అండ్ బ్రీజ్ అనిపించే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అందించాడు. అతడితో పని చేయించుకుని మోషన్ పోస్టర్లో పేరు వేయకపోవడం చిత్రంగా ఉంది. మరి ఉద్దేశపూర్వకంగా ఇలా ఎందుకు చేస్తున్నారో ఏంటో? ఈ విషయంలో తమన్ కచ్చితంగా ఫీలయ్యే ఉంటాడు. తన కెరీర్లో ఎన్నో భారీ సినిమాలకు పని చేసినా.. దీన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తున్న తమన్‌ను ఇలా ఇగ్నోర్ చేయడం అవమానకరమే కదా?